జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండో రోజు తెలంగాణలో బిజీ బిజీగా తన పర్యటనను కొనసాగించారు.రాహుల్ రెండో రోజు పర్యటనలో భాగంగా రాష్ట్ర సీనియర్ నేతలు జానారెడ్డి ,షబ్బీర్ అలీలకు చేదుఅనుభవం ఎదురైంది.ఉదయం బేగంపేటలోని హరిత ప్లాజాలో ఏర్పాటు చేసిన సీనియర్ నేతల సమావేశం కొంచెం రసాభసగా మారింది. ఈ మీటింగ్ ముఖ్యనేతల జాబితాలో రాష్ట్ర సీనియర్ నేత జానారెడ్డి ,షబ్బీర్ అలీల పేరు లేకపోవడంతో అలిగి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు. సీనియర్ల మీటింగ్ లోపలికి వెళ్లడానికి రేవంత్ రెడ్డికి పాస్ నిరాకరించగా.. సునీతా లక్ష్మారెడ్డిని అనుమతించలేదు. దీంతో ఆమె కంట తడిపెట్టారు.ఈ సందర్బంగా వారు రాష్ట్ర అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పై ఫైర్ అయ్యారని సమాచారం.
