ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ జిల్లాలో స్వాతంత్ర దిన వేడుకల్లో పాల్గొంటారు అని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి .విశాఖ జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర నిర్వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం నియోజకవర్గంలో నాతవరం మండలంలోని ఎర్రవరం జంక్షన్ వద్ద జరిగే వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.
రాష్ట్ర ప్రజలందరూ, విశాఖ జిల్లా వాసులంతా స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు వీలుగా బుధవారం పాదయాత్రకు విరామం ప్రకటించారు. అనంతరంతిరిగి గురువారం ఉదయం నుంచి పాదయాత్ర యథావిథిగా ప్రారంభమవుతుంది అని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి .