అజ్ఞాతవాసి చేదు జ్ఞాపకాలను వీలైనంత త్వరగా చెరిపేసుకోవాలని చూస్తున్నాడు త్రివిక్రమ్. ఈయన తెరకెక్కిస్తున్న అరవింద సమేత చిత్ర షూటింగ్ హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఆగస్టు 21 నుంచి 25 వరకు ప్లాష్‌బ్యాగ్ సన్నివేశాలను చిత్రీకరించనున్నాడు త్రివిక్రమ్. ఇక 26 నుంచి 31 వరకు హైదరాబాద్‌లోనే పాటల చిత్రీకరణ జరగబోతోంది. అందుకు అనుగుణంగా హైదరాబాద్‌లోనే ప్రత్యేకమైన సెట్ కూడా వేస్తున్నారు.
అలాగే, సెప్టెంబర్ 1 ను్ంచి 5 వరకు హైదరాబాద్‌లోనే మరో చిన్న షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నాడు. ఆ తరువాత 5 నుంచి 15వ తేదీ వరకు యూరప్‌లో రెండు పాటల చిత్రీకరణ జరుగుతుంది. సెప్టెంబర్ 20 లోపు టాకీ పూర్తి చేసి అక్టోబర్ 11న దసరా సీజన్‌లో విడుదల చేయనున్నారు. ఆగస్టు 15న ఈ చిత్ర టీజర్ విడుదల కానుంది. ఈ మేరకు ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేశాడు దర్శకుడు త్రివిక్రమ్.
ఆగస్టు 15న వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ కూడా రానుంది. సంకల్ప్‌రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం స్పేస్ నేపథ్యంలో సాగుతుంది. దీనికి సంబంధించిన ప్రీ లుక్ ఒకటి ఇప్పటికే విడుదలైంది. అంతరిక్షంలో ఉన్న స్టిల్ చూస్తుంటేనే ఈ సినిమా ఎలా ఉండబోతుందోనని అర్థమైపోతుంది. క్రిష్ జాగర్ల మూడి 25 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆగస్టు 15న ఫస్ట్ లుక్‌తోపాటు టైటిల్ కూడా విడుదల చేయనుంది చిత్ర బృందం.