తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి దానం నాగేందర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు .ఆయన ఈ రోజు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ పర్యటన అట్టర్ ఫ్లాప్ అయిందని ఆయన అన్నారు .
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని ఆయన అన్నారు .ఢిల్లీ నుండి వస్తున్న రాహుల్ గాంధీ కోసం ప్రజలు ఎక్కువగా కన్పించాలని కిరాయికి మనుషులను తీసుకొచ్చారు . గ్రామస్థాయిలో బూత్ లెవల్లో పార్టీ నిర్మాణం చేయకుండా తన అనుచరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారని ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి
పై సంచలన ఆరోపణలు చేశారు ..