అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన సాక్షిగా మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి కంటతడి పెట్టారు .రాహుల్ పర్యటనలో రెండో రోజు హైదరాబాద్ మహానగరంలో బేగంపేట లోని హరితా ప్లాజాలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమైన నేతలతో దాదాపు నలబై మందితో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు .ఈ సమావేశానికి కేవలం రాష్ట్ర పీసీసీ విభాగం ఇచ్చిన జాబితాలోని పేర్లు ప్రకారం లోపలకి ఎంట్రీ ఇచ్చారు .అయితే ప్లాజా దగ్గరకు వచ్చిన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి బిగ్ షాకిచ్చారు నిర్వాహకులు . జాబితాలో మీ పేరు లేదని .అందుకే లోపలకి ఎంట్రీ లేదని చెప్పడంతో ఆమె కంటతడి పెట్టారు ..
