కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీతో నారా బ్రహ్మణి సమావేశమయ్యారు. హోటల్ తాజ్ కృష్ణలో పారిశ్రామిక వేత్తలతో సమావేశం నిర్వహించిన రాహుల్ గాంధీ దాదాపు 300మంది ఇండస్ట్రియలిస్టులను ఆహ్వానించగా కేవలం వందమంది మాత్రమే హాజరయ్యారు. అయితే హెరిటేజ్ గ్రూప్‌కు చెందిన నారా బ్రాహ్మణితో పాటు తెలుగుదేశం పార్టీ నేతలు, యువ పారిశ్రామిక వేత్తలు టీజీ భరత్, జేసీ పవన్ లు హాజరయ్యారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీ, నోట్లరద్దు వంటి పరిణామాలపై రాహుల్ గాంధీతో చర్చిస్తున్నారు. అలాగే ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ది కోసం తీసుకున్న చర్యలు గురించి చర్చించారు. ఎలాంటి చర్యలు తీసుకుంటే దేశం అభివృద్ధి దిశగా దూసుకు వెళ్తున్నాయని అంశాలపై రాహుల్ పారిశ్రామిక వేత్తలతో చర్చిస్తున్నారు.
అలాగే ఎన్డీయేనుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చిన తర్వాత ఆ ఇరు పార్టీలు పూర్తిగా శత్రు రాజకీయ పార్టీలుగా మారాయి. ఈక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్ణాటకలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్ధి కుమారస్వామి సీఎం ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. ఆసమయంలో రాహుల్ గాంధీతోనూ చంద్రబాబు మంతనాలు చేసారు. అలాగే పార్లమెంట్ వద్ద సోనియా గాంధీ టీడీపీ ఎంపీలతోనూ మాట్లాడుతూ కనిపించారు. తాజాగా రాహుల్ తో టీడీపీలో క్రియాశీలక వ్యక్తి, స్వయంగా ముఖ్యమంత్రి కోడలు నారా బ్రాహ్మణి మంతనాలు చేయడం, అందులోనూ ఇద్దరు టీడీపీ ఎంపీల కుమారులు ఉండడం పట్ల మరో యేడాదిలో ఎన్నికలు రానుండడంతో పొత్తు విషయంలో ఈ భేటీ జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.