ఏపీ సీఎం చంద్రబాబును ఇంటికి పంపించడమే గడపగడపకు వైసీపీ అనే కార్యక్రమం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఏపీ మొత్తం జిల్లాలో.. గ్రామాల్లో వైసీపీ నేతలు గడపగడపకు తిరిగి వారి సమస్యలు తెలుసుకొని తగిన న్యాయం చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. అయితే గడపగడపకు వైసీపీ పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన చెరుకులపాడు నారాయాణ రెడ్డి కర్నూలు జిల్లావ్యాప్తంగా వైసీపీ తరపున బలమైన నాయకుడిగా ఎదుగుతుండటం చూసి ఆయనను రాజకీయంగా ఎదుర్కోలేకే దారుణంగా హత్యకు పాల్పడ్డారని జగమెరగని సత్యం. ఈ హత్య తరువాత అదే పత్తికొండ నియోజకవర్గం నుండి ఇంకా ఎన్నికలకు ముందే మొట్టమొదటి వైసీపీ ఎమ్మెల్యే ఆభ్యర్థిగా నారాయాణ రెడ్డి భార్య కంగాటి శ్రీదేవిని వైఎస్ జగన్ పాదయాత్రలో బాగంగా ప్రకటించాడు. దీంతో టీడీపీ నేతలు అమోమయంలో పడ్డారు. కొంతమంది వైసీపీలోకి వలసలు వచ్చారు. ఎప్పుడైయితే జగన్ నమ్మకంతో టీక్కెట్ ఇచ్చాడో..అప్పటి నుండి ఇప్పటికి పత్తికొండ నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై పోరాడుతు..వాటిని వేంటనే పరిష్కరిస్తున్నారు శ్రీదేవి. అంతేకాదు తన భర్త కర్నూల్ జిల్లాలో గడపగడపకు వైసీపీ పార్టీని ప్రజల్లోకి బలంగా ఎలా తీసుకెళ్లాడో..అదేవిధంగా శ్రీదేవి పత్తికొండ నియోజక వర్గంలో గడపగడపకు నవరత్నాలు గురించి ప్రతి ఇంటికి తెలియజేస్తు ప్రజల్లో జగన్ పై నమ్మకం కుదిరేలా చాలా క్షుణ్ణంగా వివరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ కంచుకోట కూలగొడతా..భారీ మెజార్టీతో గెలిచి..జగన్ అన్నకు కానుకగా ఇస్తా అంటున్నారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ వైసీపీ సమన్వయకర్త చెరుకులపాడు శ్రీదేవి, వైసీపీ నాయకులు పోచంరెడ్డి మురళీధర్ రెడ్డి, మండల కన్వీనర్ బజారప్ప,జిల్లా కార్యదర్శి శ్రీరంగడు, వార్డు మెంబర్లు మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
