ఏపీలో 2019ఎన్నికలు దగ్గరకు రానే వచ్చాయి కానీ చంద్రబాబు మాత్రం సీనియర్ టీడీపీ నాయకుల గురించి ఉలుకు పలుకు లేకుండా ప్రవర్తిస్తున్నారు. దీంతో వారు టీడీపీలో ఉంటే తమకు ఎదుగుదల ఉండదని భావించి, ఫ్యూచర్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయుడు వారికి షాక్ ఇవ్వక ముందే వారు టీడీపీకి గుబై చెప్పి చంద్రబాబును షాక్ కు గురిచేస్తున్నారు .ముందుగా అనంతపురం జిల్లా నుండి మొదలైయినట్లు తెలుస్తుంది. జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఇంతకుముందే లో తను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అని ప్రకటింన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా తాడిపత్రి ఎమ్మెల్యే అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి తప్పుకుంటున్న విషయాన్ని ప్రకటించారు. ఇదే సమయంలో తన స్థానంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయేది ఎవరో కూడా ప్రభాకర్ రెడ్డి ప్రకటించడు. తన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని జేసీ ప్రభాకర్ రెడ్డి అనౌన్స్ చేశారు. ఇక జేసీ కుటుంబం వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫునే పోటీ చేస్తుందా? అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఉన్న ఒక చర్చ. అంతేకాదు వచ్చేఎన్నికల్లో ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడని అని తెలిసి ..ఇంకా 10 ఏళ‌్లు మనం గెలవలేం కనుక తనయులకు అవకాశం కల్పించడానికి వీరు ఇరువురూ తప్పుకుంటున్నట్టుగా స్పష్టం అవుతోంది.
