ఏపీ ముఖ్యమంత్రి ,అధికారటీడీపీ పార్టీ అధినేత నారాచంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియాగా ముద్రపడిన ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కి చెందిన ఒక ప్రధాన తెలుగు న్యూస్ పత్రిక మరోసారి ప్రధాన ప్రతిపక్ష నిర్హా ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి సాక్షీ సంస్థల చైర్ పర్శన్ అయిన వైఎస్ భారతి రెడ్డి పై మరో విషప్రచారాన్ని తెరతీసింది .గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ టీడీపీ జగన్ పై అక్రమ కేసులు బనాయించిన సంగతి తెల్సిందే .
తాజాగా బాబు ఆస్థాన మీడియాగా ముద్రపడిన సదరు మీడియా ఛానల్ ఈడీ వైఎస్ భారతి పేరును ఐదో నిందితురాలిగా ఛార్జ్ షీట్ లో చేర్చిందని ప్రత్యేక కథనాలను వండి ప్రజల్లోకి వదిలింది. సదరు మీడియా పత్రిక చేసిన ప్రసారం మీద వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు కూడా . తాజాగా ఈ రోజు ఆదివారం కూడా సదరు పత్రిక భారతికి భారీ జీతం అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది .
ఈ క్రమంలో భారతి సిమెంట్ లో ఎక్కువగా షేర్లు ఉన్నవాళ్ళ కంటే వైఎస్ భారతి ఎక్కువ జీతం తీసుకుంటున్నారు . సిమెంట్ రంగంలో ఎటువంటి అనుభవం లేకపోయినా కానీ మూడున్నర కోట్ల కు పైగా వార్షిక వేతనంగా తీసుకుంటున్నారు అని సదరు పత్రిక వార్తలను ప్రచురించింది ..