ఏపీ రాజకీయాల్లో ప్రస్తుత హాట్ టాపిక్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి సాక్షీ సంస్థల చైర్ పర్శన్ వైఎస్ భారతీ రెడ్డి పేరును ఈడీ ఛార్జ్ షీట్ లో చేర్చింది అని . అయితే ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియాగా ముద్రపడిన ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఈ వార్తలను ప్రచురించింది . అయితే ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో ఏముందో ఒక లుక్ వేద్దామా ..
అసలు విషయం ఏమిటీ అంటే రాష్ట్రంలోని వైఎస్సార్ కడప జిల్లాలో 2037.52ఎకరాల్లో ఉన్న సున్నపు గనుల లీజు గుజరాత్ అంబుజా సిమెంట్ లిమిటెడ్ కు పునరుద్ధరించకుండా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,మరికొంతమంది నేరపూరిత కుట్రలకు పాల్పడ్డారు అని ..ఆ గనులను తామే దక్కించుకుంటామని మర్చి 27న 2006లో ఒక జీవో వచ్చేలా చేసుకున్నారు .
అంతేకాకుండా ఈ మొత్తం ఎకరాల్లో నాలుగు వందల డెబ్భై ఐదు ఎకరాల్లో నాణ్యమైన సున్నపు రాయి లేదంటూ భూములను వెనక్కిచ్చారు . అయితే 2009వరకు సున్నపు రాయిని వెలికితీయలేదు అని ఈడీ ఛార్జ్ షీట్ లో పేర్కొంది కానీ ఎక్కడ కూడా వైఎస్ భారతికి సంబంధం ఉన్నట్లు కానీ చెప్పలేదు .అయితే అసత్యాలు ముఖ్యంగా వైఎస్సార్ కుటుంబంపై విషప్రచారం చేయడంలో ఆరితేలిన బాబు ఆస్థాన మీడియా తాజాగా వైఎస్ భారతిని టార్గెట్ చేసింది ..