తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత తనయుడు పీకలదాకా త్రాగి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడిన సంఘటన వెలుగులోకి వచ్చింది .తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్లు రవి తనయుడు సిద్ధార్థ్ శుక్రవారం అర్ధరాత్రి పీకల దాక త్రాగి ఆడీ టీఎస్ 9ఈఆర్7777 కారును నడుపుతుండగా నగరంలో జూబ్లి హిల్స్ రోడ్డు నెంబర్ 45లో డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు .మల్లు సిద్ధార్థ్ ను పరిక్షీంచగా మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలింది .దీంతో పోలీసులు కేసు నమోదు చేసి పీఎస్ కు తరలించారు ..
