తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ,కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పై చీటింగ్ కేసు నమోదైంది. నజీమున్సి బేగం అనే మైనార్టీ మహిళ తన తండ్రిని 2005లో కొల్పోయింది. తల్లి కూడా మరణించింది.అయితే సదరు మహిళ అన్నయ్య తనని చంపి అస్తులు లాక్కోవాలని కుట్రలు చేశాడు.దీంతో బేగం కోర్టును ఆశ్రయించగా తన తండ్రి ఆస్థిలో వాటాగా కొద్ది మొత్తం వచ్చింది.
అయినప్పటికి తన అన్న ఆ ఆస్థి ఇవ్వాలని కుట్రలకు పాల్పడ్డాడు. దీంతో బేగం కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు కటకం మృత్యుంజయంను ఆశ్రయించింది. దీంతో నీదగ్గర ఉంటే మీ అన్న అడుగుతాడు . అందుకే తనకు పంపించాలని కటకం తేల్చిచెప్పాడు. దీంతో అతను ఆమె కుటుంబానికి బాగా తెల్సినవాడు.. అధికార పార్టీ నేత కావడంతో ఆమె అప్పుడే ఇరవై రెండు లక్షలల్లో పంతొమ్మిది లక్షల యాబై వేలను ట్రాన్స్ ఫర్ చేసింది.
అంతే కాకుండా రెండున్నర లక్షలను ఆమె లిక్విడ్ క్యాష్ ఇచ్చింది.. దీంతో తాజాగా తను ఇచ్చిన డబ్బులను వాపస్ ఇవ్వాలసిందిగా పలుమార్లు కోరింది. ఇదే విషయం గురించి అప్పుడు ఎంపీగా పొన్నం ప్రభాకర్ సాక్షిగా ఉన్నాడు. తనను నమ్మించి తన డబ్బు తీసుకుని ఇవ్వకపోవడేమ
కాకుండా డబ్బు అడిగితే చంపుతామన్నట్లు బెదిరిస్తున్నారని ఆమె గాంధీభవన్ లో గోడు వెల్లబోసుకున్నారు. ఈ విషయమై పొన్నం ప్రభాకర్, కటకం మృత్యుంజయం మీద రాహుల్ గాంధీకి రాతపూర్వక ఫిర్యాదు కూడా చేశారు.