ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే అనేక కేసులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈకేసులకు సంబంధించి మొదటిసారిగా జగన్ మోహన్ రెడ్డి భార్య భారతి పేరును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీట్ లో చేర్చింది అని ఏపీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి చెందిన ఆస్థాన మీడియా ప్రచారం చేసిన సంగతి తెల్సిందే.
ఈ సందర్భంగా ఇవాళ ఏపీ ఆర్టీసీ చైర్మెన్ వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ..జగన్ సతీమణి భారతి ని మాత్రమే కాకుండా జగన్ బామ్మర్ది బ్రదర్ అనిల్ ని కూడా చేర్పించాలని డిమాండ్ చేశారు.రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ ఆస్తులను సంపాదించడానికి జగన్ మోహన్ రెడ్డికి ఒక ఆయుధంగా బ్రదర్ అనిల్ కుమార్ పని చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అంతే వై ఎస్ భారతి పై ఈడి కాకుండా సీ బీ ఐ కేసును నమోదు చేయని కోరారు. భారతి పాత్ర ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు కన్పించినప్పుడు సీబీఐకి ఎందుకు కన్పించడం లేదని వర్ల ప్రశ్నించారు.మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన అనిల్.. వేల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు..