పేద ప్రజల కళ్ళలో వెలుగు కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని వరంగల్ మేయర్ నరేందర్ అన్నారు.ఇదో నూతన చరిత్ర అని,దేశంలోనే ఎక్కడా లేనివిదంగా నూతన అద్యాయానికి ముఖ్యమంత్రి గారు తెరతీసారని,వారి సంకల్పాన్ని అందరం బాగస్వామ్యమై విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానున్న కంటి వెలుగు పథకంపై వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ ఆడిటోరియం లో ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో అవగాహన సమావేశం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి పర్యాటక శాఖ మంత్రి చందూలాల్, మేయర్ నన్నపనేని నరేందర్,ఎంపీ సీతారాం నాయక్,జెడ్పీ చైర్మన్ పద్మ, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, శంకర్ నాయక్, దాస్యం వినయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా మేయర్ మాట్లాడుతూ..
పేద వారికి కార్పోరేట్ స్థాయిలో పరిక్షలు చేయించుకోలేరని ,వారికి ఈ కంటివెలుగు ద్వారా నూతన వెలుగును ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందిస్తున్నారని,ఉద్యమస్పూర్తితో పాలన జరుగుతుందని మేయర్ అన్నారు.నగరంలో జనాబా అధికంగా ఉంటుంది కాబట్టి వీలైనన్ని ఎక్కువ రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహించుకుందామని మేయర్ నరేందర్ అన్నారు.నగరంలో కంటివెలుగుకు కావాల్సిన ఏర్పాట్లు నగరపాలకసంస్థ చేస్తుందని,ఈ కార్యక్రమాన్ని అందరూ బాగస్వామ్యులై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.