Home / 18+ / శ్రీ‌రెడ్డి మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

శ్రీ‌రెడ్డి మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఎన్ని దారుణాలు జ‌రుగుతున్నాయో.. వాట‌న్నిటినీ ఒక్కొక్క‌టిగా వివ‌రిస్తూ త‌న‌కు న్యాయం కావాల‌ని చెప్పుకుంటూ మీడియాకెక్కిన న‌టి శ్రీ‌రెడ్డి. ఇక తాజాగా ఓ ప్ర‌ముఖ త‌మిళ ఛానెల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన శ్రీ‌రెడ్డి టాలీవుడ్‌లోని ద‌గ్గుబాటి ఫ్యామిలీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ముందుగా ఆ యాంక‌ర్ మాట్లాడుతూ.. టాలీవుడ్‌లో మీరు ఒక‌రితో అని అన‌గానే..! వెంట‌నే మాట‌ను అందుకున్న శ్రీ‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

మీ అమ్మా, బాబులు నిర్మాత‌ల‌యి ఉండి.. పిచ్చ పిచ్చ‌గా సంపాదించి, అంద‌రి ర‌క్తాలు తాగేసి, ఆ థియేట‌ర్ల‌ను ద‌గ్గ‌ర పెట్టుకుని ప్రొడ‌క్ష‌న్లు చేసి, గ‌వ‌ర్న‌మెంట్ నుంచి స్థ‌లాల‌ను లాక్కొని, ఆ స్థ‌లాల్లో స్టూడియోలు క‌ట్టుకుని, దాని మీద సంపాదించి ప్ర‌తీ రూపాయి నా ద‌గ్గ‌ర‌కు ఎలా వ‌స్తుంది, నా ఖ‌జానాలో ఎలా చేరుతుంద‌నే రీతిలో ఇంగితం లేని పిచ్చికుక్క‌ల్లాగా సినీ నిర్మాత‌లు సంపాద‌న మీద ప‌డ్డార‌ని, వారిలో టీలీవుడ్ బ‌ఢా నిర్మాత ద‌గ్గుబాటి సురేష్ బాబు అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

శ్రీ‌రెడ్డి అంత‌టితో ఆగ‌క మీకు కొడుకుల‌ను ఎలా పెంచుకోవాలో తెలీదు.. వాళ్ల‌కు విలువ‌లు ఎలా నేర్పించాలో తెలీదు. ఒక మ‌నిషితో.. మ‌రో మ‌నిషి ఎలా వ్య‌వ‌హ‌రించాలో తెలీదు. క‌ని, పెంచిన త‌రువాత కుమారుల‌ను ప‌బ్బుల‌కు, ప్రొడ‌క్ష‌న‌ల పేరుతో జ‌నాల మీద‌కు వ‌ల‌డం కాదు అటూ హిత‌వు ప‌లికింది.

ఏం, మీరు సిగ్గుశ‌రం పెట్టి పుట్ట‌లేదా..? ఏది మంచో.. ఏది చెడో అని రాముడు లాంటి దేవుళ్లు పుట్టి చూపించ‌లేదా..? వ్యాల్యూస్ పెట్టుకుని ఎందుకు బ‌త‌క‌వు..? మ‌నిషి ఎలా బ‌త‌కాలో చెప్పే గ్రంథాలు ఉన్నాయి. వాటిని చ‌ద‌వ‌లేదా..? మీరేం చేస్తున్నారు…? యువ‌త‌కు మీరేం నేర్పిస్తున్నారు..? అంటూ సురేష్‌బాబుపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది శ్రీ‌రెడ్డి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat