రేణుదేశాయ్, పదిహేనేళ్ల క్రితం సినిమాలకు గుడ్ బై చెప్పినా.. ఇప్పటికీ ఆమె క్రేజ్ అలానే ఉంది. పవన్ కళ్యాణ్, ఆయన మాజీ భార్య అన్న ట్యాగ్ లైన్ ఇప్పటికీ ఉంది. తనను పవన్ కళ్యాన్ మాజీ భార్య అని పిలవడం ఇష్టం లేదని చెబుతున్నా కూడా అభిమానులు మాత్రం ఇప్పటికీ ఇలానే చూస్తున్నారు. అయితే, రేణు దేశాయ్ రెండో పెళ్లికి సిద్ధమవుతున్న ఈ తరుణంలో తన జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయాలను తీసుకుంటుంది రేణుదేశాయ్.
అయితే, రేణు దేశాయ్ నటనాపరంగా దూరంగా ఉన్నప్పటికీ.. సినీ ఇండస్ట్రీకి దగ్గరగానే ఉంది రేణు దేశాయ్. అప్పట్లో పవన్ నటించిన చాలా డిజైన్లకు కాస్టింగ్ డిజైన్ చేసింది. ఆ తరువాత పవన్‌తో విడిపోయాక సొంత భాష మరాఠీలో ఇష్క్ వాలా లవ్ చిత్రంతో దర్శకురాలిగా మారింది. ఈ చిత్రంలో పవన్ తనయుడు అఖీరా నందన్ కూడా ఉన్నాడు.
ఇక అసలు విషయానికొస్తే.. రేణుదేశాయ్ తెలుగులోనూ ఒక సినిమా చేయబోతోంది. ఈ మేరకు ఒక ప్రకటను కూడా విడుదల చసింది. రైతుల ఆత్మహత్యల కథతో ఈ చిత్రం తెరకెక్కనుందని, పూర్తిగా విలేజ్ బ్యాక్ డ్రాప్లో రాబోయే ఈ చిత్రాన్ని రేణుదేశాయ్ నిర్మించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కనుంది.