వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. చిన్నారుల నుంచి.. వృద్ధుల వరకు జగన్‌ను కలిసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అదే సమయంలో వారి సమస్యలను జగన్‌కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలను చెప్పుకునేందుకు తన వద్దకు వస్తున్న ప్రజలను అక్కున చేర్చుకుని.. తానున్నానంటూ వారికి భరోసా కల్పిస్తూ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ముందుకు సాగుతున్నారు వైఎస్ జగన్.
అయితే, జగన్ చేస్తున్న పాదయాత్ర ప్రస్తుతం తుని నియోజకవర్గంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చెన్నాయపాళెం గ్రామానికి చెందిన చింతల నాగేశ్వరరావు, శివకుమారి దంపతులు వైఎస్ జగన్‌ను కలిశారు. వారికి జరిగిన అన్యాయాన్ని జగన్‌కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడు చెప్పుకుని కన్నీరు పెట్టుకున్నారు. తమలాంటి కష్టం మరొకరికి రాకూడదంటూ బోరు మన్నారు.
ఇంతకీ వైఎస్ జగన్‌తో మాట్లాడిన శివ కుమారి ఏం చెప్పిందంటే..? తాను ప్రసవం నిమిత్తం తుని ఆస్పత్రిలో చేరితో.. ఆపరేషన్ చేసి.. పాపను బయటకు తీశారని, అదే సమయంలో ఎక్కువ రక్త శ్రావం జరగడంతో.. ఏ గ్రూపో తెలియని బ్లడ్‌ను తనకు ఎక్కించారని తెలిపింది. ఆ తరువాత వైద్యులు తమ తప్పును కప్పి పుచ్చుకునేందుకు అమ్మాయికి యూరిన్ పైప్ ఒక్కటే పెట్టాలంటూ రాత్రికి రాత్రే కాకినాడ ఆస్పత్రికి తరలించారన్నారు.
కాకినాడ ఆస్పత్రి వైద్యులు మాత్రం.. తుని నుంచి ఇది నాలుగో కేసు. గతంలో ఇటువంటి కేసులు మూడు వచ్చాయి. ఇదంతా తుని ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా జరిగిందని కాకినాడ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. తుని ఆస్పత్రి వైద్యులు రాంగ్ బ్లడ్ ఎక్కించడం వల్ల, నిర్లక్ష్యం కారణంగా శరీరంలోని ఊపిరితిత్తులు, గుండె పాడైపోతాయని చెప్పారు. అలా తన అనారోగ్యం కారణంగా ఇప్పటి వరకు 1 2 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని చెప్పింది. ఎంతో నిరుపేదలమైన తాము లక్షలకు.. లక్షలు అప్పు తేవాల్సిన పరిస్థితి అంటూ జగన్ వద్ద కన్నీరు మున్నీరైంది.
ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా జరిపే గ్రీవెన్ సెల్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారంటూ తమకు జరిగిన అన్యాయాన్ని జగన్‌కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడు చెప్పుకుని కన్నీరు పెట్టుకున్నారు. తమలాంటి కష్టం మరొకరికి రాకూడదంటూ శివకుమారి భర్త నాగేశ్వరరావు జగన్‌ను కోరారు. వైద్య సాయం చేయాలని వైఎస్ జగన్‌ను కోరారు.