ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఫ్యామీలీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందా…ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ మహిళ నేత భారీ మెజార్టీతో గెలుస్తుందా…లేదా అనేది తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే. కర్నూలు జిల్లా, డోన్ సమీపంలోని కంబాలపాడుకు చెందిన కృష్ణమూర్తి బీసీ వర్గమమయిన ఈడిగ కులానికి చెందిన నాయకుడు. రెడ్ల రాజకీయాధిపత్యం కొనసాగుతున్న రాయలసీమలో నాయకుడిగా ఎదిగిన ఏకైక బీసీ నేత కేఈ కృష్ణమూర్తియే. కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రాబల్యం ఒక వైపు కేఈ కుటుంబం మరొక వైపు- ప్రత్యర్థి కుటుంబాలు. విజయభాస్కర్ రెడ్డిని ఎదిరించి నిలిచిన కుటుంబం ఇదొక్కటే. రాయలసీమలో ఒక అగ్రకులం నాయకుడిని ఎదరించి ఫ్యాక్షన్ నడిపే స్థాయికి ఎదిగినా ఆయన అఖిలాంధ్ర బిసినాయకుడు కాలేక పోయారు. ముగ్గురు తమ్ముళ్లు, బలమయిన కులం ఉన్నా ఆయన ములాయం సింగో, లాలూ ప్రసాదో కాలేకపోయారు.
మరోపక్క కృష్ణ మూర్తి కుమారుడు శ్యాంబాబు బాగా వెనకబడిపోయాడు. అసలే నాయకుడు అయ్యే లక్షణాలు కనబడడం లేదని సీనియర్ రాజకీయ నాయకులు చేబుతున్నారు. అందుకు కారణాలు కూడ వారు చెప్పారు. అందులో మొడటిది ..ఆయనపై ఇసుక మాఫియా అనే ఆరోపణలు ఉన్నాయి..దీనిపై హైకోర్టులో కేసు కూడ ఉంది..మరోక్కటి కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డిని దారుణంగా హత్యచేశారు. ట్రాక్టర్‌తో గుద్ది, బాంబులు విసిరి, రాళ్లు రువ్వి, వేటకొడవళ్లతో నరికి చంపేశారు. కాపాడటానికి ప్రయత్నించిన ఆయన అనుచరుడినీ హత్య చేశారు. ఈ హత్యకు కారణం శ్యాంబాబు అని శ్రీదేవి ఎన్నోసార్లు మీడియా ముందు తెలిపింది. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబానికి చెరుకులపాటి నారాయణరెడ్డి అత్యంత సన్నిహితుడు. 2014 ఎన్నికల దాకా ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగారు. 2014 ఎన్నికల్లో పత్తికొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. కేఈ కృష్ణమూర్తి చేతిలో ఓడిపోయారు. ఎన్నికల అనంతరం వైసీపీలో చేరారు. అప్పటి నుండి నియోజక వర్గంలో వైసీపీ బలాన్ని భారీగా పెంచారు. ఇది తట్టుకోలేక వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించలేమని తెలుసుకుని హత్య చేసినట్లు ఆమె చెప్పారు. నారాయణ రెడ్డి హత్యకు కేఈ సోదరులే కారణమని నారాయణరెడ్డి భార్య శ్రీదేవి, సోదరుడు ప్రదీప్‌రెడ్డి బలంగా చెప్పారు. కేఈ కుమారుడు శ్యాంబాబు, ఎస్సై నాగ తులసీప్రసాద్ హత్యలో కీలకపాత్ర పోషించారని ,పత్తికొండలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కొడుకు ఆగడాలు ఎక్కువయ్యాయని అన్నారు. ఈవిదంగా కెయి కృష్ణ మూర్తి ఫ్యామీలీ ప్రతిష్టకు బాగా భంగం కల్గింది.
మరోపక్క చాలా కాలం తాను ప్రాతినిధ్యం వహించిన డోన్ నియోజకవర్గం 2014లో వైసిపికి వెళ్లి పోయింది. 2014లో వైసీపీ తరుపున అసెంబ్లీలో ఎన్నికల్లో పోటీ చేసే తొలి అభ్యర్ధిని వైసీపీ అధినేత వైయస్ జగన్ ప్రకటించారు. ఓ బహిరంగ సభలో డోన్ నియోజకవర్గ టిక్కెట్‌ను బుగ్గనకు ఇవ్వనున్నట్లు జగన్ ప్రకటించారు. ఆ తర్వాత 2014లో వచ్చిన సాధారణ ఎన్నికల్లో ముందుగానే ప్రకటించిన హామీ మేరకు బుగ్గన రాజేంద్రనాథ్‌కు డోన్ అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. టీడీపీ సీనియర్ నేత, ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రతాప్‌పై బుగ్గన రాజేంద్ర నాథ్ గెలిచాడు. డోన్ వైసీపీ చేతిలోకి పోయింది.ఇక మిగిలింది పత్తికొండ అది కూడ 2019 లో ఖచ్చితంగా వైసీపీ మాజి ఇంచార్జ్ చెరుకులపాడు నారాయణ రెడ్డి బార్య శ్రీదేవి విజయం సాదిస్తుందంటా..ఎలా అంటారా..సాధారణ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉన్నప్పటికీ, వైసీపీ తరుపున అసెంబ్లీలో ఎన్నికల్లో పోటీ చేసే తొలి అభ్యర్ధిని వైసీపీ అధినేత వైయస్ జగన్ ప్రకటించారు. దీంతో శ్రీదేవికే టిక్కెట్ ఇచ్చినా వేంటనే యాభైవేల మెజార్టీతో గెలిపించుకుంటాని అక్కడ ప్రజలు జగన్ ముందే చెప్పారు. అప్పటి నుండి ఇప్పటికి పత్తికొండ నియోజక వర్గం ప్రజల యొక్క తన భర్త కళను…జగన్ ఇచ్చిన మాటను శ్రీదేవి నిలుపుకుంటున్నారు. ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ…గ్రామ, గ్రామాలకు వెళ్లి వారి సమస్యలను దగ్గరుండి తెలుసుకొని న్యాయం చేస్తున్నారు. కష్టాల్లో ఉన్నావారిని ఆదుకుంటున్నారు. అంతేకాదు ఏపీలో వైసీపీ నేతలో ఎప్పటికి అప్పుడు టచ్ లో ఉంటున్నారు. దీంతో నారాయణ రెడ్డి అనుచరులు ఆనందం వ్యక్తం చేశారు.. తప్పకుండ వచ్చే ఎన్నికల్లో శ్రీదేవిని గెలిపిస్తాం అని ఆ నియోజక వర్గ ప్రజలు తెలుపుతున్నారు..అంటే ఇక ఆమె గెలుపు ఖాయం అయినట్లే… కనుక ఇక కెఈ కృష్ణమూర్తి కొడుకు ఓటమీతో ..కెయి ఫ్యామీలీ రాజకీయలకు ముగింపు అవ్వడం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.