Home / SLIDER / సీఎం కేసీఆర్ నిర్ణ‌యంతో…ర‌జ‌కుల జీవితాల్లో కొత్త రికార్డ్‌..!

సీఎం కేసీఆర్ నిర్ణ‌యంతో…ర‌జ‌కుల జీవితాల్లో కొత్త రికార్డ్‌..!

తెలంగాణ రాష్ట్రం వ‌స్తే ఏం వ‌చ్చింది? అని ప్ర‌శ్నించే వారికి ఓ జవాబు. స‌బ్బండ వ‌ర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లతో పాటు ఇతర ప్రభుత్వ సంస్థల్లో బట్టలుతికే పనులను రజకులకే అప్పగించేలా విధానపరమైన నిర్ణయం తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రజక యువకులకు ప్రత్యామ్నాయ ఉపాధి కోసం బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలు అందిస్తామని వెల్లడించారు. రజక వృత్తిలో ఉన్న 50 ఏండ్లు దాటిన వారికి ఆసరా పెన్షన్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. హైదరాబాద్ నగరంలో ఎకరం స్థలంలో రూ.5 కోట్ల వ్యయంతో రజకుల కోసం హాస్టల్, కమ్యూనిటీ హాల్ నిర్మించనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో చాకలి అయిలమ్మ విగ్రహాన్ని స్థాపిస్తామని చెప్పారు. ప్రజలకు సేవచేస్తున్న కులాల అభ్యున్నతి కోసం కృషి చేయాల్సిన సామాజిక బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని సిఎం అన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలోని కులవృత్తులకు ప్రోత్సాహం కరువైందని, ఇప్పుడు ఆ కులవృత్తులను నిలబెట్టే గట్టి ప్రయత్నం చేస్తున్నామని సిఎం చెప్పారు.
ప్రగతి భవన్ లో శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ రజకసంఘం ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యలపై చర్చించారు.
మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాచర్ల ఉప్పలయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు మానస గణేష్, కో ఆర్డినేటర్ కొల్లూరు మల్లేశ్ కుమార్,అసోసియేట్ అధ్యక్షుడు కొలిపాక రాములు, ప్రధాన కార్యదర్శి కొల్లంపల్లి వెంకటరాములు, నాయకుడు కొండూరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నరు. సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రికి వినతి పత్రం సమర్పించారు. రజకులకు ఆర్థిక చేయూత అందించే కార్యక్రమాలు అమలు చేయడం కోసం బడ్జెట్లో రూ.250 కోట్లు కేటాయించామని, ఇంకా అవసరమైన పక్షంలో మరిన్ని నిధులు ఇవ్వడానికి కూడా సిద్దంగా ఉన్నామని సీఎం చెప్పారు. ఆ నిధులతో రజకుల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో రజక సంఘం ప్రతినిధులే నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. రజక సంఘం కోరుకున్న విధంగానే కార్యక్రమాలు అమలు చేయడానికి సిద్ధంగా  ఉన్నామని వెల్లడించారు. మురికి బట్టలు ఉతికే క్రమంలో అనారోగ్యం పాలవుతున్నారని, కాబట్టి రజకుల వైద్యానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని సిఎం వెల్లడించారు.
హైదరాబాద్ నగరంలోనూ, ఇతర నగరాల్లోనూ, జిల్లా కేంద్రాల్లోనూ, పట్టణాల్లోనూ దోబీఘాట్ల నిర్మాణం జరపుతామని, బట్టలు నేలపై ఆరేయకుండా దండాలు ఏర్పాటు చేసే పద్దతి పెట్టాలని సిఎం చెప్పారు.ప్రభుత్వ ఆసుపత్రులు, రెసిడెన్షియల్స్  స్కూళ్లలో ఎక్కువ సంఖ్యలో బట్టలు ఉతకడానికి అవసరమయ్యే వాషింగ్ మెషిన్లను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని, ఆ పనిని రజకులకే అప్పగిస్తామని వెల్లడించారు. హెచ్ఎండిఎ, జిహెచ్ఎంసితో పాటు ఇతర నగరాలు, పట్టణాల్లో చేసే లే అవుట్లలో ఖచ్చితంగా బట్టలు ఉతికి, ఇస్త్రీ చేయడానికి అనువుగా కొంత స్థలం తీసి, రజక సంఘాలకు అప్పగించాలని సిఎం అధికారులను ఆదేశించారు. దోబీఘాట్లకు, వాషింగ్ మెషిన్లకు సబ్సిడీపై కరెంటు సరఫరా చేసే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు. హైదరాబాద్ నగరంలో ఎరుకుల కులస్థుల సామాజిక, విద్యా ప్రగతికి దోహదపడే విధంగా భవనం నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దీనికి అవసరమైన స్థలం కేటాయించడంతో పాటు, నిర్మాణానికి అవసరమయ్యే వ్యయం కూడా పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఎరుకుల కులస్తుల ఉపాధి కోసం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తామని చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat