కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనపై ఆ పార్టీ నేతలు చేస్తున్న హడావుడి, విమర్శలపై టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఘాటుగా స్పందించారు. రాహుల్ పర్యటనను అడ్డుకోవాలని చూస్తున్నారని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారంపై మండిపడ్డారు. “రాహుల్ గాంధీ హైదరాబాద్‌కి వస్తే ఏంటి..??ఎర్రగడ్డకి వస్తే మాకు ఏంటి…??టీఆర్ఎస్ పార్టీ నాయకులు పర్మిషన్‌ను ఎందుకు అడ్డుకుంటారు?..
తెలంగాణ లో ఒక ఎమోషన్ రెచ్చగొట్టాలి అని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది….రాష్ట్రంలో లో నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారు“ అని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం లో విద్యార్థులను కొట్టించింది కాంగ్రెస్ కాదా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. రాహుల్ గాంధీ పర్యటనకు ఓయూలో అనుమతి రాకపోవడానికి ప్రభుత్వానికి ఏంటి సంబంధమని బాల్క సుమన్ సూటిగా ప్రశ్నించారు. సరూర్ నగర్‌లో సభకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఓయూలో రాజకీయ పార్టీల సభలకు అనుమతి ఇవ్వడం లేదని వీసీ తెలిపారని సుమన్ గుర్తు చేశారు.
రాహుల్ ఓయూకు రాగానే రాజకీయాలు ఏమి అటు ఇటు కావని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీవి చిల్లర రాజకీయాలని, బట్ట కాల్చి మొహం మీద పడేస్తాంటే కుదరదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ పార్టీ పని చేస్తున్న నేపథ్యంలో వాటిని ఎలా అడ్డుకోవాలి అని కాంగ్రెస్ చూస్తుందని సుమన్ మండిపడ్డారు.
Tags balka suman congress ou rahul gandhi telangana tpcc trs