ఈ నెల 15న రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఅర్ కరీంనగర్ నగరంలో పర్యటించనున్నారు.ఈ సందర్బంగా అయన నగరంలోని ఐటీ టవర్ నిర్మాణ పనులను పరిశీలిస్తారని ఎమ్మెల్యే కమలాకర్ అన్నారు.రానున్న సంక్రాంతికి సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు కానుకగా ఈ ఐటీ టవర్ ను అందిస్తామని తెలిపారు.కరీంనగర్ లోని ఉజ్వల పార్క్ వద్ద నిర్మాణంలో ఉన్న ఐటీ టవర్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. జీ ప్లస్ ఫోర్ పద్దతిలో నిర్మిస్తున్న టవర్ పనులు చురుగ్గా జరుగుతున్నాయి అని అన్నారు . డిసెంబర్ నాటికే టవర్ నిర్మాణ పనులు పూర్తి చేసి జనవరిలో ఇక్కడి యువత ఇక్కడే జాబ్స్ చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు.
