వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రలో చిన్నారులు సైతం అడుగులు వేస్తున్నారు. ప్రత్యేక హోదా వైఎస్ జగన్‌తోనే సాధ్యమంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తున్నారు. వైఎస్ జగన్ వస్తేనే పేదలకు మేలు జరుగుతుందని ప్రజలంతా నినదిస్తున్నారు. వైఎస్ జగన్ వెంట వేలాదిగా అడుగులు వేస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్రకు వస్తున్న స్పందన మాటల్లో చెప్పలేనిదంటున్నారు ఉభయగోదావరి జిల్లాల ప్రజలు.
పాదయాత్ర జరుగుతున్న ప్రాంతాల్లో జగన్ నినాదాలతో మారుమ్రోగుతున్నాయని చెప్తున్నారు. ఎవరి నోట విన్నా జగనన్న పేరు వినిపిస్తుందని చెబుతున్నారు. ప్రజల హృదయాలను గెలిచిన నాయకుడు వైఎస్ జగన్ అని పార్టీ నేతలు అంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నారు. ఊలపల్లి నుంచి 212వ రోజు పాదయాత్రను ప్రారంభించి బిక్కవోలు మీదుగా నడుస్తున్నారు. అయితే, జగన్ పాదయాత్ర నేపథ్యంలో పలు సంస్థలు చేసిన సర్వేలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికారం చేపట్టడం ఖాయమంటూ ఫలితాలను వెల్లడించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా , వైఎస్ జగన్‌పై ఎటువంటి ఆధారాలు లేకుండా, గత ప్రభుత్వాలు అక్రమంగా బనాయించిన కేసుల్లో ఇప్పటికే (11 ఛార్జిషీట్లలో) తొమ్మిది ఛార్జిషీట్లు వీగిపోగా.. మిగిలిన రెండు ఛార్జిషీట్లలో కూడా జగన్ నిర్దోషిగా, కడిగిన ముత్యంలా బయటకు రావడం ఖాయమని అటు న్యాయవాదులతోపాటు.. ఇటు సీబీఐ అధికారులే బాహాటంగా చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన వైసీపీ శ్రేణులు.. సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడన్నది ఎంత సత్యమో.. 2019లో జగన్ సీఎంగా బాధ్యతలు చేపడుతారన్నది కూడా అంతే సత్యమంటూ సంబురాల్లో మునిగి తేలుతున్నారు.
అయితే, అక్రమాస్తుల కేసులో వైఎస్ భారతిపై అభియోగాలు దాఖలయ్యాయన్న వార్తలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం స్పందించారు. ఈడీ అధికారులు ఎటువంటి ప్రకటన చేయకుండానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన మీడియా, ఏపీ అధికార పార్టీ అనుకూల మీడియాలు ఎలా ప్రసారం చేస్తాయని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే పచ్చ మీడియా, పావలా మీడియాలు రెండు వైఎస్ఆర్ ఫ్యామిలీపై అసత్యపు ప్రచారం చేస్తున్నాయని, జనసేన, టీడీపీకి ఆ పార్టీలు ఏజెంట్‌లుగా పని చేస్తున్నాయన్నారు.
భారతి సిమెంట్స్‌లో మెజార్టీ వాటాను, ఫ్రాన్స్ కంపెనీ వికా కొనుగోలు చేసిందని, వికా కంపెనీకి అమ్మగా వచ్చిన డబ్బును పన్ను కట్టగడం జరిగిందన్నారు. కంపెనీని స్థాపించడానికి చట్టపరంగా కావాల్సిన అనుమతులు, నిర్వహణ అన్నీ ఉన్నప్పటికీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అధికార పార్టీ ఇటువంటి అసత్యపు ప్రచారాలను తన అనూకూల మీడియా ద్వరా ప్రసారం చేయిస్తున్నాయన్నారు. నాడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఎదుర్కోలేక పోయారని, అదే రీతిన నేడు వైఎస్ జగన్‌ను ఎదుర్కొనేందుకు ధైర్యం చాలక దొడ్డిదారిన అక్రమంగా కేసులు బనాయిస్తున్నారన్నారు.
హైదరాబాద్ కేంద్రంగా ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబు అడ్డంగా దొరికారని, వాటికి సాక్ష్యాధారాలు పక్కాగా ఉన్నా.. కేసు మాత్రం ముందుకు సాగడం లేదన్నారు. ఇందుకు సీఎం చంద్రబాబు ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టారన్నారు. చంద్రబాబు కుట్రలను ప్రజలందరూ గమనిస్తున్నారని, చంద్రబాబు జైలుకెళ్లే రోజులు దగ్గరపడ్డాయన్నారు తమ్మినేని సీతారం.