గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం.. లక్షా80వేలమంది ఓటర్లున్నారు. వీరిలో ఎస్సీలు 60వేలు, బీసీలు45వేలు, కమ్మ22వేలు, కాపులు 20వేలు, రెడ్లు10వేలు, మైనార్టీలు 6వేలమంది ఉన్నారు. 1962లో ఏర్పడిన ఈ నియోజకవర్గం 2009నుంచి ఎస్సీలకు రిజర్వ్ అయ్యింది. భట్టిప్రోలు, అవర్తలూరు, చుండూరు, వేమూరు, కొల్లూరు మండలాలున్నాయి. 2014లో ఇక్కడినుంచి గెలిచిన రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు.. ఈయనకు రాజకీయంగా ఎదురుగాలి వీస్తోందట.. గుంటూరు జిల్లా వేమూరు నుంచి వరుసగా రెండుసార్లు గెలిచారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆనందబాబు గెలవడం అంత సులువు కాదని సొంత పార్టీ నేతలే చెప్తున్నారు.
మంత్రిగా ఆయన నియోజకవర్గ ప్రజలకు దగ్గరకాలేదని, కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండడం లేదట.. ఎమ్మెల్యేగా కార్యకర్తలను ఆదరించిన నక్కా మంత్రి పదవి పొందిన తరువాత దూరం అయ్యారట.. అసలు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులను పూర్తి చేయించలేకపోయారనేది ప్రధాన విమర్శ. మంత్రిగా తన శాఖపై పట్టుసాధించలేకపోయారనేది అధికార వర్గాలు చెప్తున్నమాట.. ఎస్సీ నియోజకవర్గమైన వేమూరులో సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా బలమైన ముద్ర వేయాల్సిన ఆయననిమిత్తమాత్రంగా వ్యవహరిస్తున్నారని, సమస్యలను సీరియస్‌గా తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఇసుకరీచ్ లల్లో మంత్రి అనుచరులు దండుకుంటున్నారట.. 2007లో మూత పడ్డ జంపని షుగర్ ఫ్యాక్టరీని ఇప్పటివరకూ తెరిపించలేకపోయారు. చెరకు సాగు, ఫ్యాక్టరీ నడపడం ద్వారా ప్రత్యక్ష, పరోక్షంగా వేలమంది బతుకుతారట.. చుండూరు మండలంలోని రోడ్లు అద్వాన్నంగా ఉన్నాయట., అమర్తలూరు నుంచి నిజాంపట్నం వరకు రోడ్డు వేస్తే దాదాపుగా గ్రామాలకు కనెక్టివిటీ ఏర్పడి ఎంతో ఉపయోగకరమట. వేమూరులో తయారయ్యే కృష్ణానది ఒండ్రు మట్టితో తయారు చేసే ఇటుకలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నా మంత్రి వీటిని ప్రమోట్ చేయడం లేదట.
భట్టిప్రోలులోని శాతవాహనుల కాలం నాటి బౌద్ధ స్థూపాన్ని డెవలప్ చేస్తే పర్యాటకంగా బావుంటుదన్నా మంత్రి పట్టించుకోవడం లేదట. వేలకోట్లు నిధులున్న సాంఘిక సంక్షేమశాఖలోని నిధులను ఉపయోగించుకుకోవటం లేదట. ఇటీవల వేమూరులో నిర్వహించిన ముఖ్యమంత్రి సభకు కూడా ప్రజలనుంచి పెద్దగా స్పందనలేదట.. ప్రజలను సమీకరించడంలో, వారిని ఆకర్షించడంలోనూ నక్కా ఘోరాతి ఘోరంగా విఫలమయ్యారని పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ చైతన్యం కలిగిన గుంటూరు జిల్లాలో సాంఘికసంక్షేమశాఖ మంత్రిగా దూసుకపోవాల్సిన నక్కా పనితీరు బాగోలేదట. గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో గెలుపొందిన ఆనందబాబుకు ఈసారి ఫలితాలు ఆనందాన్నివ్వలేవట.
ప్రస్తుతం మంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన పట్టుసాధించని కారణంగా ఆశాఖ కార్యదర్శి ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెడుతున్నారనే విమర్శ వస్తోంది. మంత్రి కార్యాలయ సిబ్బంది చేతివాటం నక్కాకు చెడ్డ పేరు వస్తోందట. ఆశాఖ నుంచి విడుదల చేసే నిధుల్లో భారీ అవినీతి జరుగుతుందని సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. మొత్తమ్మీద ఆనందబాబు వ్యక్తిగతంగా మంచివాడైనా ఆయన వ్యవహారశైలి, పట్టించుకోని విధానం, భారీ ఎత్తున అవినీతి, నియోజకవర్గంలో పట్టు లేకపోవడం, వైసీపీకి వేమూరులో ఎక్కువ పట్టు ఉండడంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున మేరుగు నాగార్జున ఘన విజయం సాధించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మేరుగు నాగార్జున దూకుడు, వైసీపీ కార్యకర్తల ఉత్సాహంతో ప్రస్తుతం వేమూరులో వైసీపీ జోరు కనిపిస్తోంది.