ఏపీ రాజధారి అమరావతి ప్రాంతంలో ముఖ్య ప్రాంతమైన మంగళగిరిలో ఫ్రెండ్లీ పోలీసింగ్ కు బదులు రౌడీ పోలీసింగ్ నడుస్తోందట.. తాను మాట్లాడేదే కరెక్టే అంటూ ఎస్సై భార్గవ్ చెలరేగిపోతున్నారట.. ఈయనగారి గురించి మంగళగిరిలో ఎంతో గొప్పగా ఉందంటూ స్థానికులు చెప్పుకుంటున్నారట.. మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం సెక్షన్ 177 ప్రకారం మొదటి తప్పు క్రింద మినిమం రూ.100/- ఫైన్ నుండి రూ.200/- వరకు ఫైన్ రాసే అధికారం పోలీసు వారికి ఉంటుంది.
కానీ వారు అత్యుత్సాహం తో రూ.200/-పెనాల్టీ లు రాస్తూ మధ్య తరగతి మనుషులను ఇంకా ఇబ్బంది కి గురి చేస్తూ ఓ ప్రక్క వారి జేబులు మరో ప్రక్క రాష్ట్ర ఖజానా ను నింపే పనిలో ఉన్నారు. వీళ్లు చదువు కున్న మూర్కులు అని ఓ సీనియర్ సిటిజన్లు కూడా అంటున్నారంటూ అర్ధం చేసుకోవచ్చని తెలుస్తోంది. అధికార పార్టీకి కొమ్ము కాయడంకోసం ప్రతిపక్ష పార్టీ నేతలను ఇబ్బంది పెట్టడం షరా మామూలుగానే కనిపిస్తోంది. కొద్దిరోజులుగా రాజధాని ప్రాంతంలోని పోలీసులు రకరకాల కారణాలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం, భయభ్రాంతులకు గురిచేస్తూ పేట్రేగిపోతున్నారని సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.