వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటిసారి గుటుంబ సభ్యుల విషయంలో బాధపడుతూ చేసిన ట్వీట్ చూసి ఆయన అభిమానులంతా బాధపడుతూ భావోద్వేగానికి గురవుతున్నారు. జగన్ ను జైల్లో పెట్టినా, కేసుల్లో ఇరికించినా, రాజకీయంగా మాటలతో హింసించినా జగన్ ఏనాడూ బాధపడలేదు.
తన పార్టీని అధికారంలోకి తీసుకురావడంపైనే, ప్రజల్లో ఉండడం పైనే ఆయన దృష్టి కేంద్రీకరించారు. చాలా క్లిష్ట సమయాల్లో కూడా జగన్ విలువైన రాజకీయాలు పోషించారు. అయితే ప్రస్తుతం ప్రజాసంకల్పయాత్ర ద్వారా వేలకిలోమీటర్లు నడుస్తూ మొక్కవోని దీక్షతో నడుస్తున్నారు. ఈ సమయంలో ఆయన సతీమణి వైస్ భారతి పేరు ఈడీ చార్జ్ షీట్ లో ఉందంటూ మీడియాలో వచ్చిన వార్తలపై జగన్ బాధపడుతూ ట్విట్టర్లో స్పందించారు.
“మీడియాలో వచ్చిన వార్తలు చూసి షాక్ కి గురయ్యాను. నా భార్య పేరు ఈడీ చార్జీ షీట్ లో ఎక్కడా లేదు. కుటుంబ సభ్యులను కూడా రాజకీయాల కోసం బైటకు లాగడం చూస్తుంటే బాధ కలుగుతుంది. ప్రస్తున్నా పరిణామాలు చూస్తుంటే రాజకీయాలు ఇంత దిగజారపోయాయని అనిపిస్తుంది.. బాధగా ఉంది.” అంటూ జగన్ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఈ వరుస పరిణామాలు చూస్తున్న అభిమానులు పార్టీ శ్రేణులు భావోద్వేగానికి గురవుతున్నారు. వైఎస్ కుటుంబ విధేయులు, వైఎస్ పధకాల ద్వారా లబ్ధిపొందినవారంతా అన్నా నీకు అంతా అండగా ఉంటామంటూ 2019లో గెలుపు ద్వారానే అన్నిటికీ సమాధానాలిస్తామంటూ వైసీపీ శ్రేణులు జగన్ కు భరోసానిస్తున్నారు.