మా అన్న మూడు కాదురా.. వంద పెళ్లిళ్లు చేసుకుంటాడు..! నీకేంట్రా బాధ..?? నీ అక్కనో.. చెల్లినో పెళ్లి చేసుకుని.. అలా వాడుకుని.. అంతా అయిపోయాక వదిలేస్తే అప్పుడు తెలుస్తుంది రా ఆ బాధేంటో..! అంటూ పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టి మరీ కార్టూన్ టైప్‌లో ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ, ఈ మాటలు ఎవరు అన్నారో..? ఎందుకు అన్నారో..? ఎప్పుడు అన్నారో..? తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని పూర్తిగా చదివేసేయండి మరీ..!
ఇంతకీ పై మాటలు అన్నది ఎవరో కాదండి బాబోయ్.. స్వయాన శ్రీరెడ్డి. వర్ధమాన తార శ్రీరెడ్డి మంచి యాంకర్ మాత్రమే కాదు, ప్రభావితురాలైన నటి కూడా. తెలుగు టెలివిజన్ రంగంలో రాణిస్తుండగానే సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆశించిన ఫలితం దక్కలేదు. గత కొద్ది రోజులుగా ఫ్యాషన్ రంగంలో కాలం వెల్లదీసిన శ్రీరెడ్డి ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలుగు అమ్మాయిలకు హీరోయిన్ ఆఫర్లు ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసింది.
సినిమాపై మక్కువతో అన్ని వదులుకున్నా కానీ, అనేక అవమానాలకు గురైనా కానీ చివరకు ఏమీ దక్కలేదు. ఏ ఉద్యోగం చేసుకున్నా కానీ నెలకు ఇంత డబ్బు వస్తుంది. కానీ, హీరోయిన్లకు ఆ పరిస్థితి లేదు. ఇక తెలుగు అమ్మాయిల గురించి చెప్పనక్కర్లేదు. సినిమా అవకాశాలు ఇప్పిస్తామంటూ చెప్పి వాడుకుంటారు. ఆ తరువాత సినిమా ఆగిపోయిందంటారు. లేకపోతే సినిమా నిర్మాతతోపాటు డైరెక్టర్ ఆ తరువాత కెమెరామెన్ కూడా ఉన్నాడని చెబుతారు. అన్నీ అయిపోయిన తరువాత సినిమా ఆగిపోయిందని చెబుతుంటారు అంటూ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి.
అయితే, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే శ్రీరెడ్డి ఇటీవల పోస్ట్ చేసిన ఓ ఫోటో వైరల్ అయింది. ఆ ఫోటోనే.. జనసేన అదినేత పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్‌బాబులకు సంబంధించింది. అందులో పవన్ కళ్యాన్ ఫోటోపై.. మా అన్న మూడు కాదురా.. వంద పెళ్లిళ్లు చేసుకుంటాడు. నీకేంట్రా బాధ..? అని ప్రశ్నిస్తూ ఉండగా.. మహేష్‌బాబు ఫోటోపై మాత్రం నీ అక్కనో.. చెల్లినో పెళ్లి చేసుకుని.. అలా వాడుకుని.. అంతా అయిపోయాక వదిలేస్తే అప్పుడు తెలుస్తుంది రా ఆ బాధేంటో..! అంటూ ఉంది. శ్రీరెడ్డి పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల కాలంలో నెటిజన్లు సోషల్ మీడియాలో సంధిస్తున్న ప్రశ్నలకు.. పవన్ కళ్యాన్‌కు చిర్రెత్తుకొచ్చి.. మూడు కాదు.. వంద పెళ్లిళ్లు చేసుకుంటానంటూ ప్రకటించినా ప్రకటిస్తాడని శ్రీరెడ్డి ఎద్దేవ చేసింది.