ప్రధాని మోడీ ,పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ల మధ్య ఇవాళ ఆసక్తికరమైన సంభాషణ చోటు చేసుకుంది.ఈ రోజు పార్లమెంట్ లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా పరిధిలోని రక్షణ శాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని మోడీని టీఆర్ఎస్ ఎంపీలు కోరారు.ఈ సందర్బంగా మోడీ అక్కడున్న ఎంపీ బాల్క సుమన్ ను చూసి..
మీ ఎంపీలందరిలో నువ్వే చిన్నవాడివా ? అని అడిగారు.ఈ సందర్బంగా ఎంపీ
సుమన్ నవ్వుతూ.. అవును సార్..ఎంపీలల్లో నే కాదు.. తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరికంటే కూడా చిన్నవాణ్ణి.తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నేతగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చాను.
అని సమాధానం ఇచ్చారు.అనంతరం మోడీ.. ఓహ్ అది నాకు తెలుసు… గుడ్ గుడ్ అంటూ ప్రశంశించారు.
కాగా టీఆర్ఎస్ ఎంపీ లు మోడీ ని కలిసి..రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించనున్న సచివాలయం, శాసనసభ భవనాల గురించి ప్రధానికి టీఆర్ఎస్ ఎంపీలు వివరించారు. వీటితో పాటు రోడ్ల విస్తరణ, నిర్మాణం కోసం కంటోన్మెంట్ ఏరియా పరిధిలోని రక్షణ శాఖ భూములు ఇవ్వాలని కోరారు. రక్షణ శాఖ భూములు బదలాయించాలని గత మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్న విషయాన్ని ప్రధానికి గుర్తు చేశారు. ఢిల్లీలో ప్రధానిని కలిసి రక్షణ శాఖ భూముల వ్యవహారంపై వినతిపత్రం అందించారు.