తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ నగర వాసులకు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు శుభవార్త తెలిపారు.నగరవాసులు ఎంతోకాలంగా ఎదిరి చూస్తున్న అమీర్‌పేట్ – LBనగర్ మెట్రోను సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభించనునట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఇవాళ LB నగర్-కామినేని ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్,మహేందర్ రెడ్డి,మేయర్ బొంతు రామ్మోహన్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో అభివృద్ధి అత్యంత వేగంగా జరుగుతుందన్నారు.
నగరంలో వివిధ దశల్లో ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతుందని..LB నగర్ లో రూ. 450 కోట్లను రోడ్డ కోసం కేటాయించామని చెప్పారు.నగరంలోని హైటెక్ సిటీ మైండ్ స్పేస్ వద్ద త్వరలోనే ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుందని… LB నగర్ లో మరో ఐదు ఫ్లైఓవర్లు త్వరలోనే పూర్తి చేస్తున్నామన్నారు.LBనగర్ నుంచి నాగోల్ కు, శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వరకు మెట్రోను విస్తరిస్తామని చెప్పారు.నగరంలో రూ. 100 కోట్లతో ఫుట్ పాత్‌ల నిర్మాణం జరుగుతుందన్నారు. ప్రజలు బాగుండాలన్నదే ప్రభుత్వ ఏకైక లక్ష్యమని తెలిపారు. 2030 కల్లా దేశంలో మెగాసిటీగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందన్నారు.సీఎం కేసీఆర్ ఆశయాలతో ముందుకెళ్తున్నామని తెలిపారు. నగర శివారు ప్రాంతాల్లో ట్రాఫిక్ పెరుగుతన్న క్రమంలో MMTS రెండో దశను సికింద్రాబాద్-యాదాద్రి వరకు పొడిగిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా చెప్పారు.