వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైస్ భారతి పేరు ఈడీ చార్జ్ షీట్ లో ఉందంటూ ఇవాళ మీడియాలో పలు రకాలుగా వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.అయితే ఇదే విషయంపై జగన్ స్పందిస్తూ..నా భార్య పేరు ఈడీ చార్జీ షీట్ లో ఎక్కడా లేదు. కుటుంబ సభ్యులను కూడా రాజకీయాల కోసం బైటకు లాగడం చూస్తుంటే బాధ కలుగుతుంది. ప్రస్తున్నా పరిణామాలు చూస్తుంటే రాజకీయాలు ఇంత దిగజారపోయాయని అనిపిస్తుంది.. బాధగా ఉంది.” అంటూ జగన్ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.అయితే ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆస్థాన మీడియానే కావాలని ప్రచారం చేస్తుందని సోషల్ మీడియాలో ఒక వార్త చల్ చల్ చేస్తుంది..ఆ వార్త మీకోసం…
ఈడీ లీకులు వెనకున్నది పచ్చ ముఠానే !!
తన స్వార్థంకోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు దిగజారతాడనే దానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ . మీడియాలో తనమీద వ్యతిరేక వార్తలు రాగానే వాటిని మరుగుపర్చటం కోసం సొంత పచ్చ ఛానెల్స్ ని ఉపయోగించి బురదచల్లటం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య .
భారతి సిమెంట్స్ మీద కేసు వేసింది 2011 ఆగష్టు 10 న . ఆరోజు చంద్రబాబు కోసమే పనిచేసిన కేడీ లక్ష్మీనారాయణ కూడా భారతిగారు పేరు రాయలేదు . అప్పటికేసులో పసలేదని భారతి సిమెంట్ చార్జిషీట్లో ఉన్న అధికారులందరినీ ఇప్పటికే వదిలేసారు . మరి ఏడు సంవత్సరాల తరువాత 2018 ఆగష్టులో ఈరోజు ఈడీ ఎందుకు భారతిగారు పేరుతో లీకులు ఇస్తుంది ? దీనివెనుక ఎవరున్నారు ?
పరకాలప్రభాకర్ కి చంద్రబాబు ప్రభుత్వంలో అంత హోదా ఎందుకు దక్కింది ? దానివెనుక చంద్రబాబు లెక్కలు ఏమిటి ? జగన్ గారి మీదున్న కేసులలో సీబీఐ వరసగా చేతులెత్తేస్తుంటే ఎందుకు ఈడీ మాత్రమే అటాచ్మెంట్లు పేరుతొ హడావుడి చేస్తుంది ? దీనివెనుక ఉన్న శక్తులు ఏమిటి ?
పరకాలప్రభాకర్ భార్య నిర్మలాసీతారామన్ మొన్నటి ఫైనాన్స్ మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖని స్వతంత్ర మంత్రి హోదాలో ( ఇండిపెండెంట్ ఛార్జ్ ) నిర్వహించింది . ఈడీ అనేది నేరుగా అదే శాఖ కింద పనిచేస్తుంది . ఏరోజైతే ఆమెకి ఈ శాఖ దక్కిందో అదేరోజు ఇక్కడ రాష్ట్రంలో పరకాలని చంద్రబాబు అందలం ఎక్కించాడు . ఆమె అండదండలతోనే ఈడీలో చంద్రబాబు మనుషులైన ఉమాశంకరగౌడ్ , గాంధీ అనే ఇద్దరు పచ్చ అధికారులు కేంద్రంలో వివిధ హోదాలలో ఉన్నవాళ్లు ఈడీలోకి వచ్చారు . ఉమాశంకర గౌడ్ స్వయంగా టీడీపీ ఎంపీ దేవేందరగౌడ్ కి మేనల్లుడు . దేవేందరగౌడ్ పార్టీ నుండి బయటకి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చినా , ఆయనకి ఆరోగ్యం సరిలేక మంచానికే పరిమితమైనా కూడా చంద్రబాబు ఆయనని రాజ్యసభకు పంపాడు . దానికి కారణం ఈడీలో ఉన్న ఉమాశంకరగౌడ్ . ఒక పక్క పరకాల మరోపక్క ఈడీలో ఉన్న ఇద్దరి పచ్చ అధికారులు సహాయంతో అటాచ్మెంట్లు , అదనపు చార్జిషీట్లు పేరుతో లీకులు ఇస్తున్నారు .
జగన్ గారిని ఎలాగైనా రాజకీయంగా అంతంచేయాలని తప్పుడు కేసులు పెట్టించిన కాంగ్రెస్ హయాంలో ఈడీతో కాకుండా సీబీఐ తోనే వ్యవహారం నడిపారు . అప్పుడు చంద్రబాబు సొంత మనిషి కేడీ లక్ష్మీనారాయణ సీబీఐలో ఉండటంతో రోజుకొక లీకులు ఇస్తూ రాజ్యాంగానికి విరుద్ధంగా 16 నెలలు జైల్లో ఉంచగలిగారు .
ఆతరువాత సీబీఐ కేసులన్నీ కోర్టులలో వీగిపోవటంతో ఇప్పుడు పైన చెప్పిన ఇద్దరు పచ్చ అధికారులు సహాయంతో బరితెగిస్తున్నారు . ఆనాడు ఏవిధంగా అయితే కేడీ లక్ష్మీనారాయణ పచ్చ పత్రికలకి లీకులు ఇచ్చేవాడో ఇప్పుడు అదే విధంగా ఉమాశంకర గౌడ్ , గాంధీ లీకులు ఇస్తున్నారు .
ఈ ఇద్దరి అధికారులకి అసాధారణంగా మూడు పర్యాయాలు ఈడీలో పొడిగింపు ఇచ్చారంటేనే తెలుస్తుంది పచ్చ ముఠా ఎంత పకడ్భందిగా కుట్ర పన్నుతుందోనని .
చంద్రబాబు ఇలాంటి ప్రయోజనాలని పొందటం కోసమే రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టాడు . చంద్రబాబు , సృజనాచౌదరి ఇద్దరూ కలిసి అనేకమార్లు జైట్లీని కలిసినా బీజేపీ పెద్దలని కలిసినా వాళ్ళు కోరేది జగన్ గారిని ఏదోరకంగా కేసుల పేరుతొ జైల్లో పెట్టమని .
చంద్రబాబు ఆనాడు కాంగ్రెస్ తో కుమ్మక్కయి కిరణ్ ప్రభుత్వాన్ని కాపాడి , రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ కి మద్దతిచ్చింది కూడా జగన్ గారిని కేసులలో ఇరికించే ఒప్పందంతోనే. మళ్ళీ ఈ నాలుగేళ్లలో ప్రత్యేకహోదాని తాకట్టు పెట్టింది కూడా జగన్ గారిని ఏదోరకంగా అడ్డు తొలిగించటం కోసమే . మాకు ప్రత్యేకహోదా అవసరంలేదు , జగన్ ని ఏదోరకంగా జైల్లో పెట్టండి దానికోసం నేను చెప్పిన అధికారులని నియమించండి దానికితోడు నాకేసులు జోలికి రావొద్దు అంతకుమించి నాకేమి అవసరంలేదని ప్రత్యేకహోదాని తాకట్టు పెట్టాడు .
మనం ఇంకో విషయం కూడా గమనించొచ్చు. సీబీఐ పేరుతొ కానీ , ఈడీ పేరుతో కానీ వచ్చే లీకులు కూడా చంద్రబాబు కష్టాలలో ఉన్నప్పుడే వస్తాయి . మీడియాలో చంద్రబాబు బ్యాడ్ అయినప్పుడల్లా ఇలాంటి పచ్చ అధికారులు రంగంలోకి దిగి ఏదో ఒక కేసుపెరుతో లీకులు ఇస్తారు . అలాంటి లీకులు కోసం , చంద్రబాబు తుచ్చ రాజకీయాలకోసం దిగజారి మహిళలని కూడా చూడరు .
చంద్రబాబు ఎంతటి ఘనుడంటే ఆనాడు కాంగ్రెస్ ని వాడుకొని కేసులు పెట్టించి , రాష్ట్రాన్ని విడగొట్టించి ఆఖరికి కాంగ్రెస్ కి చిప్పచేతికిచ్చాడు . మళ్ళీ బీజేపీతో జతకట్టి వాళ్ళని అడ్డంపెట్టుకొని సొంత ప్రయోజనాలకోసం ప్రత్యేకహోదాని తాకట్టు పెట్టి కేసులలో లబ్ధిపొందుతున్నాడు . మొన్నటి ఎన్నికలలో కాంగ్రెస్ ని బూచిగా చూపించి వాళ్లకి జగన్ తో సంబంధాలు అంటకట్టినట్లే రేపు కూడా ఆఖరికి తనచేతకాని తనాన్ని బీజేపీ మీదకి నెట్టేసి బీజేపీతో జగన్ కి సంబంధాలు అంటగట్టి ప్రయోజనం పొందాలని చూస్తున్నాడు .
2014 కి ముందు కాంగ్రెస్ ని పూర్తిగా వాడుకొని పిండి పిప్పి చేసి వదిలేసాడు . ఇప్పుడు బీజేపీ వంతు . చంద్రబాబుని నమ్ముకొని కాంగ్రెస్ ఏ విధంగా భూస్థాపితం అయ్యిందో రేపు బీజేపీకి కూడా అదే గతి పడుతుంది .
చంద్రబాబుకి ఎవరైనా అడ్డు అనుకొంటే వాళ్ళని ఎలాగైనా నాశనం చేసేవరకు నిద్రపోడు . దానికోసం తండ్రిలాంటి మామనే చంపేశాడు అలాంటిది రాష్ట్రం ప్రజలు పార్టీలు అసలు ఆయనకి లెక్క కూడా కాదు .