ఏపీలో సెల్ఫగోల్ ఎక్స్‌పర్ట్ ఎవరు అని అంటే.. టక్కున ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబేనని ఎవరినడిగినా చెబుతారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు సంపాదించుకున్న సర్టిఫికేట్ అది. తప్పులమీద తప్పులు చేస్తూ తన గొయ్యి తానే తవ్వుకోవడంలో చంద్రబాబును మించిన వారు లేరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే, ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాన్ కాస్త చంద్రబాబుకు పోటీ ఇస్తున్నారు. మరీ చంద్రబాబు అంత స్థాయిలో కాకున్నా.. పవన్ కళ్యాణ్ దొరికిపోతూ ఉంటారు.
పవన్ కళ్యాణ్ సభలో మాట్లాడుతున్నారు అంటే నెటిజన్లు అలర్ట్ అయిపోతారు. ఆ రోజు తమకు మంచి కామెడీ షో దొరుకుతుందని పండుగ చేసుకుంటారు. నిజానికి రాజకీయాలంటే పవన్ అనుకుంటున్నట్టు అవతలి వాళ్లను ఏవో నాలుగు తిట్లు తిట్టేసి వెళ్లిపోవడం కాదు. అన్ని అంశాలపైనా సమగ్రమైన అవగాహన ఉండాలి. అందులోను అత్యున్నత పదవి ఆశిస్తున్న వ్యక్తులైతే ప్రతీ మాటను.. ఆచి.. తూచి మాట్లాడాలి. ఏదైన అంశంపై అవగాహన రాహిత్యం ఉన్నా.. అది ప్రజలకు తెలియకుండానైనా జాగ్రత్తపడాలి. కానీ, చంద్రబాబుకైనా.. పవన్ కళ్యాన్‌కైనా ఆవేశమే తప్పా.. ఆలోచన ఎక్కడ ఉంది..?
తాజాగా పవన్ కళ్యాన్ మరో సారి తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారు. అయితే, 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబుకు అనుభవం ఉంది కాబట్టి మద్దతు ఇచ్చానంటూ పవన్ కళ్యాన్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత టీడీపీ కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయట పడుతుండంతో.. నాడు చంద్రబాబు సీనియర్ కాబట్టి మద్దతు ఇచ్చా అంతే తప్ప మరొకటి ఆశించి కాదంటూ టీడీపీ నుంచి బయటకు వచ్చారు జనసేన అధినేత పవన్. ఇటీవల కాలంలో జనసేన సభలో భాగంగా పవన్ మాట్లాడుతూ.. నాడు జనసేనకు రాజ్యసభ సీటు కోసం టీడీపీకి మద్దతు ఇచ్చానంటూ మరో సంచలన వ్యాఖ్యలు చేశాడు. చివరకు ఎన్టీఆర్ లానే.. తనను కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడంటూ జనసేన సభ సాక్షిగా పవన్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఇలా పవన్ కళ్యాణ్ తప్పుల మీద తప్పులు చేస్తూ.. తనలోని అజ్ఞానాన్ని తనే బయట పెట్టుకుంటున్నాడని రాజకీయ విశ్లేషకులతోపాటు.. నెటిజన్లు సైతం తమ అభిప్రాయాన్ని నెట్టింట్లో వ్యక్తం చేస్తున్నారు.
Publiée par Sri Reddy sur Lundi 6 août 2018