ఏపీ టీడీపీ అధ్యక్షుడు ఎక్కడైనా సమస్యలుంటే తీర్చాలి. కానీ, శ్రీకాకుళంలో ఇప్పుడు ఆయనే ఓ వివాదాన్ని పెంచి పోషిస్తున్నారని టీడీపీల చర్చ సాగుతోంది. ఎమ్మెల్సీ ప్రతిభా భారతిని టార్గెట్ చేసి కళా వెంకట్రావు నడుపుతున్న రాజకీయం ఇప్పుడు జిల్లాలో రచ్చకెక్కిందట. ఇటీవల ఇన్‌ఛార్జ్ మంత్రి పితాని సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కళా వెంకట్రావు గైర్హాజరయ్యారట. అయితే. అదే సమయంలో కళా వెంకట్రావు జిల్లాలోనే ఉండటం గమనార్హం. మరో మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌ఛార్జ్‌లు హాజరయ్యారు.
ఈ సమావేశంలో మంత్రి కళా వెంకట్రావుపై ప్రతిభా భారతి పితానికి ఫిర్యాదు చేశారట. నియోజకవర్గంలో తనను డమ్మీ చేసి కళా వెంకట్రావు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మంత్రి పితాని ఎదుట కన్నీరు పెట్టుకున్నారట ఎమ్మెల్సీ ప్రతిభా భారతి. ఆమెకు కొనసాగింపుగా కళా వెంకట్రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన జెడ్పీ ఛైర్‌పర్సన్ చౌదరి దనలక్ష్మీ కూడా మంత్రి కళాపై పితాని సత్యనారాయణకు ఫిర్యాదు చేశారట. తమను కళా వెంకట్రావు అవమానిస్తున్నారని ఫిర్యాదు చేశారట. ఇలా కళా వెంకట్రావుపై ఇద్దరు ఎదురు తిరగడం సంచలనంగా మారింది.
కళా వెంకట్రావు రాజాం నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో ప్రతిభా భారతి కుటుంబానికి టిక్కెట్ రాకుండా పావులు కదుపుతున్నారనే ప్రచారం సాగుతోంది. మాజీ మంత్రి కొండ్రు మురళీని టీడీపీలోకి తేవాలని ప్రతిభా భారతి వర్గీయులు ఆరోపిస్తున్నారు. అలా చేస్తే ఎచ్చెర్లలో కొండ్రు మురళీ వలన తనకు కొద్దో.. గొప్పో కలిసి వస్తుందని కళా భావిస్తున్నారని గుస.. గుసలు ఉన్నాయి. పార్టీలో కళా వెంకట్రావు, ప్రతిభా భారతిని పొమ్మనకుండా.. పొగబెడుతున్నారనే చర్చ టీడీపీలో వినవస్తోంది.
పై రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంత్రి కళా వెంకట్రావుపై టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ప్రతిభా భారతి తీవ్ర మనస్థాపం చెందారట. మరోపక్క, త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ టీడీపీలో తన ప్రాభవాన్ని తగ్గించేందుకు కళా వెంకట్రావు కుట్రలు, కుతంత్రాలు పన్నుతుండాన్ని నిశితంగా గమనించిన ఎమ్మెల్సీ ప్రతిభా భారతి పార్టీ మారే ఆలోచన చేస్తున్నారన్న వార్తలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.
అయితే, ఇప్పటికే ఇటు ప్రజల సమస్యతోపాటు.. ప్రత్యేక హోదా సాధన కోసం మొదటి నుంచి పోరాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఇప్పటికే ప్రజల నుంచి సానుకూల పవనాలు వీచిన విషయం తెలిసిందే. దీంతో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లోను వైసీపీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని ఇప్పటికే పలు సర్వేలు ఫలితాలను వెల్లడించాయి. దీంతో పలు రాజకీయ పార్టీల సీనియర్ నాయకులు సైతం వైసీపీలో చేరారు. మరికొందరు చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కోవలో ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్సీ ప్రతిభా భారతి కూడా చేరిపోయారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం లో ముగియనున్న విషయం తెలసిందే. ఆ సమయంలోనే వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు సిద్ధమైపోయారు ఎమ్మెల్సీ ప్రతిభా భారతి, జెడ్పీ చైర్ పర్సన్.