రైతుల అభివృద్ధే లక్ష్యంగా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు . అంతేకాకుండా దేశంలో రైతుబంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని చెప్పారు . రైతుకు ప్రీమియం చెల్లించి.. బీమా కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం కూడా తెలంగాణే అన్నారు. ఇవాళ రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో రైతుబంధు జీవిత బీమా సర్టిఫికెట్లను మంత్రి పోచారం రైతులకు అందజేశారు.ఈ సందర్బంగా అయన మాట్లాడారు.
కుటుంబానికి ఆధారమైన రైతు దురదృష్టవశాత్తు మరణించినా ఆ కుటుంబం ఆర్ధికంగా ఇబ్బందులు పడకూడదనే మంచి ఉద్యేశంతో రాష్ట్రంలో రైతుబంధు జీవిత బీమా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి రైతుకు ప్రీమియంగా రూ. 2,271 చొప్పున మొత్తం 636 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం LIC సంస్థకు చెల్లించడం జరిగిందని చెప్పారు.ఆగస్టు 14 రాత్రి నుంచి రైతుబంధు జీవితబీమా అమలులోకి వస్తుందన్నారు .కుటుంబానికి ఆధారమైన రైతు దురదృష్టవశాత్తు చనిపోతే… ఆ కుటుంబానికి ఆసరాగా రూ. 5 లక్షల బీమా అందుతుందన్నారు.