చంద్రబాబు రాష్ట్ర చరిత్రలో హీనుడిగా మిగిలిపోతాడని వైసీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ విమర్శించారు. హోదా సాధనకోసం జగన్ తన ఎంపీలతో రాజీనామాలు చేయిస్తామని ప్రకటిస్తే టీడీపీ నేతలు అవహేళన చేశారన్నానరు. గుంటూరు వంచనపై గర్జన దీక్షలో జోగి మాట్లాడుతూ పదవి కోసం ముఖ్యమంత్రి పీఠం కోసం సొంత మామను చెప్పులతో కొట్టించిన చంద్రబాబు వెన్నుపోటు దారుడిగా మిగిలిపోతే, హోదాకోసం పదవులను వదిలేసుకున్న వైసీపీ ఎంపీలు పంచపాండవులని, వీరికి చంద్రబాబుకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. హోదాకోసం రాజీనామాలు చేసిన ఎంపీలను అభినందించారు. దేశరాజకీయాలన్నీ వైసీపీవైపు చూస్తున్నాయన్నారు. టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేయకుండా దొడ్డిదారిన పారిపోయి అవిశ్వాసం పెట్టారన్నారు. తమ చంద్రబాబు చిక్కుకున్నారని నరేంద్రమోడీ లోక్‌సభలో చెప్పారన్నారు. హోదా సాధించే క్రమంలో ఎందాకైనా పోరాడుతారని ప్రధాని ఒప్పుకున్నారు. టీడీపీ ఎంపీల వేషాలన్నీ అయిపోయాయని, వీరి వేషాలు చూసి రోత పుడుతుందని ప్రజలు విసుక్కుంటున్నారన్నారు. వేషాలన్నీ అయిపోయాయని, ఆడ, మగ వేషాలు తప్ప మరోవేషం వేయాలని ప్రజలంతా భావిస్తున్నారు. టీడీపీనేతలు దద్దమ్మలని ప్రజలు ఆరోపిస్తున్నారు. హోదా జగన్‌తోనే సాధ్యమని, హోదా ఎజెండాతోనే ఎన్నికలకు వెళ్తామన్నారు. 175 స్థానాలకు 150 పైచిలుకు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు జోగి.
