అప్పటి ఏపీ దివంగత మాజీ సీఎం నేదురుమల్లి జనార్థన్ రెడ్డి తనయుడు ,ప్రస్తుత ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అయిన నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి వైసీపీలో చేరడం ఖాయమైంది.ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని కలిశారు.
ఈ సందర్భంగా దాదాపు గంటపాటు భేటీ అయ్యారు.ఈ క్రమంలో రాం కుమార్ రానున్న ఎన్నికల్లో వెంకటగిరి నుండి బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఈక్రమంలో ఈ నెలలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలోకి రానున్నారు..అయితే ఏ రోజు చేరనున్నారో త్వరలోనే ప్రకటించనున్నట్లు ఆయన మీడియాకు వివరించారు..