నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చేపట్టిన సిస్టర్స్ ఫర్ చేంజ్ కార్యక్రమం పట్ల ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు ఇన్స్పైర్ అయ్యారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే బాధ్యతను చేపట్టారు. హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల రోడ్డు ప్రమాదం జరిగితే కుటుంబాలు తమ వాళ్ళను కోల్పోతున్న పరిస్థితిని తెలియజేస్తూ వీడియోను పోస్ట్ చేశారు మహేష్ బాబు.ఈ సందర్భంగా ఎంపి కవిత మహేష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియో సందేశం ఎందరికో స్ఫూర్తిని ఇస్తుందన్నారు.
రోడ్డు ప్రమాదంలో విలువైన ప్రాణాల్ని కోల్పోతున్న దయనీయమైన పరిస్థితిని గమనించిన ఎంపీ కవిత గత ఏడాది తన సోదరుడు రాష్ట్రమంత్రి కేటీఆర్ కు రాఖీ కట్టి, హెల్మెట్ ను ఇచ్చి గిఫ్ట్ ఏ హెల్మెట్.. సిస్టర్ ఫర్ చేంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఎంపీ కవిత చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందించిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎంపీ కవిత మళ్లీ ఈనెలలో జరిగే రాఖీ పండగ నాటికి హెల్మెట్ ధరించాలి అన్న విషయం పైన ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా నిర్వహిస్తున్నారు.
మహేష్ బాబు వీడియో సందేశం
మన దేశంలో జరిగే రోడ్డు ప్రమాదంలో రోజుకు 28 మంది హెల్మెట్ లు పెట్టుకోక పోవడం వల్ల చనిపోతున్నారు.. 28మంది కుటుంబాలు వాళ్ళు ప్రేమించే మనుష్యులను కోల్పోతున్నారు.
ఒక చిన్న కేర్ లెస్ వల్ల.. ఇట్స్ స్టాండ్ ఫర్ చేంజ్..
ఈ రక్షాబంధన్ కు మీ అన్నయ్యకు తమ్ముడికి ఒక హెల్మెట్ ను గిఫ్ట్ గా ఇవ్వండి
తప్పకుండా హెల్మెట్ పెట్టుకోమని చెప్పండి లైఫ్ సేవ్డ్ ఈజ్ ద ఫ్యామిలీ సేవ్డ్..
Sister4change…
Happy Birthday @urstrulyMahesh garu !! Best wishes and a heartfelt thank you for your video message supporting this virtuous cause of #Sisters4Change. I'm sure this will inspire others to #GiftAHelmet and save precious lives ! pic.twitter.com/0KcK7DZLQa
— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 9, 2018