ఎంబీబీఎస్ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తపేటకు చెందిన చోడవరపు ప్రకాష్‌కు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. రెండవ కుమార్తె హిమజ (22) ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతోంది. ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరంలో సబ్జెక్టులు మిగిలిపోవడంతో సప్లిమెంటరీ రాసింది. పరీక్ష సరిగా రాయలేదని మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న టూటౌన్ ఎస్త్సె సుబ్రహ్మణ్యం ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్‌లో ద్వితీయ సంవత్సరం సబ్జెక్టులు మిగిలిఉన్నాయని, సప్లిమెంటరీ లో కూడా పరీక్ష సరిగా రాయలేదని, అదే రోజు ఆత్మహత్య చేసుకుందామనుకున్నా ధైర్యం చాలలేదని పేర్కొంది. తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నారని, ఎంబీబీఎస్ చదువు తనకు ఎక్కడం లేదని, తల్లిదండ్రులు క్షమించాలని నోట్‌లో రాసిఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
