ఎన్ని కంపెనీలు ఉన్నాయన్నది కాదు.. ఎంత ఉపాధి కల్పించామన్నది ముఖ్యమని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.ఇవాళ య్ధరబాద్ మహానగరంలోని పార్క్ హయత్‌లో ఐసీసీఎస్‌ఆర్‌సీ రీజినల్ కౌన్సిల్ సమావేశం జరిగింది.ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్బంగా హైదరాబాద్ నగరంలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఉత్పత్తి రంగంలో జర్మనీని ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి సూచించారు. రాష్ర్టాభివృద్ధి కోసం ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌తో కలిసి పని చేస్తామని చెప్పారు. గత నాలుగేళ్లలో తెలంగాణలో ఎంతో అభివృద్ధి సాధించామని.. రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే విద్యుత్ సమస్యను అధిగమించామని కేటీఆర్ చెప్పారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో దేశంలో రెండో స్థానంలో ఉందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు.
IT & Industries Minister @KTRTRS speaking at the Opening Session of Indian Chamber of Commerce Southern Region Council in Hyderabad. pic.twitter.com/tlrTB7feOm
— Min IT, Telangana (@MinIT_Telangana) August 9, 2018