ఇటీవల ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు మండలంలోని కాల్వబుగ్గ టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన వైసీపీ క్షేత్రస్థాయి కమిటీ సభ్యుల సమావేశానికి హజరైన ఆయన మాట్లాడుతూ తనకు నియోజకవర్గంలో ప్రజాధరణ ఉన్నంతవరకు పాణ్యం
నియోజకవర్గాన్ని వదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు ..రానున్న ఎన్నికల్లో పాణ్యం నుండే బరిలోకి దిగి గెలుస్తా ..జగన్ ను సీఎం చేస్తా అని ఆయన అన్నారు ..
