టీడీపీ అక్రమాలకు అడ్డూ.. అదుపు లేకుండా పోతోంది. అధికారంలో ఉంటే ఏమైనా చేయొచ్చనే రీతిలో ఆ పార్టీ నేతలు విచ్చల విడిగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు సర్కార్ చేపట్టిన మరో పథకం టీడీపీ నేతలకు కల్ప తరువులా తయారైంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందాన చంద్రబాబు పథకాల పేరిట దోపీకి తెర తీస్తున్నారు. పథకం పేరుతో ప్రజలను ఆకర్షించడం.. అదే పథకం నిధులను పక్కదారి పట్టించి టీడీపీ నేతలకు దోచి పెట్టడం వంటి ఆలోచనలు చంద్రబాబుకు తప్ప మరెవ్వరికీ రావనే విమర్శలు ఏపీ రాజకీయ నాయకులు బహిరంగంగానే అంటున్నారు.
అయితే, చంద్రబాబు సర్కార్.. ప్రభుత్వ బడ్జెట్‌ను వేల కోట్ల రూపాయలు కేటాయించి వనం – మనం పేరుతో ఏపీ వ్యాప్తంగా భారీ సంఖ్యలో మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు తన మనవడితో పాటు కుటుంబ సభ్యులచే మొక్కలు నాటించారు కూడాను.
సీఎం చంద్రబాబు నాయుడు ఇలా మొక్కలు నాటుకుంటూ పోతుంటే.. మరో పక్క తనయుడు నారా లోకేష్ అవే మొక్కలను నరుక్కుంటూ పోతున్నారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందనేగా మీ డౌట్. అయితే, ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే మరీ.
చంద్రబాబు సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టామని చెప్పుకుంటున్న వనం – మనం కార్యక్రమంలో భాగంగా ఇవాళ మాచర్ల పట్టణంలో విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. మొక్కలు ఆరోగ్యానికి మేలు. చెట్టు మేలు తెలుసుకో… మొక్కనాటి మురిసిపో అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు.
మరో వైపు అవే మొక్కలను నరకడంలో మంత్రి నారా లోకేష్ టీమ్ గ్రామ కార్యదర్శి మునిగి తేలుతోంది. ఈ వింత ఘటన మాచర్ల పట్టణంలో దర్శనమివ్వడం గమనార్హం. మొక్కలను ఎందుకు నరుకుతున్నారని నారా లోకేష్ టీమ్‌ను స్థానికులు ప్రశ్నిస్తే.. మా సారు.. గ్రామ కార్యదర్శి కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా ఈ మొక్కలను నరుకుతున్నామంటూ వారు సమాధానం ఇవ్వడంతో అవాక్కవడం స్థానికుల వంతైంది. ఇదండీ అసలు సంగతి..! నీరు – చెట్టుతో తండ్రి.. గ్రామదర్శిని పేరుతో తనయుడు ఇలా ఇద్దరూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారంటూ చర్చించుకోవడం మాచర్ల పట్టణ ప్రజల వంతైంది. వారు మరో మాట కూడా అన్నారండోయ్.. అదే.. ఇదీ మన ప్రభుత్వ దౌర్భాగ్య పాలన.. అని..!