అక్కడ వైఎస్సార్సీపీకి న్యాయకత్వమే లేదన్నారు.. నియోజకవర్గ సెంటర్లో ఫ్లెక్సీ కట్టే నాధుడే లేడన్నారు. ఆనియోజకర్గంలో పార్టీ కోసం పనిచేయడానికి డబ్బులు ఇస్తే తప్ప కాసేపు పనిచేయడానికి ఒక్క మనిషీ రాడన్నారు.. అంతెందుకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడానికి కూడా ఒక్కడూ లేడన్నారు.. ఆ నియోజకవర్గంలో అసలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే లేదన్నారు.. అదే పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్.. ఉండి నియోజకవర్గ తెలుగుదేశం గుండెల్లో రైళ్లు పరుగెట్టించడానికి, ఉండి గడ్డపై వైస్సార్సీపీ జెండా ఎగురవేయడానికి నేనున్నానంటూ దూకిన సింహం పీవీఎల్ నరసింహం ఆయనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉండి అభ్యర్ధి పీవీఎల్ నరసింహ రాజు..
కేవలం పీవీఎల్ కు బాధ్యతలు అప్పగించిన కొద్దిరోజులకే నియోజకవర్గ ప్రజల్లో ఆశలు రేకెత్తాయి.. ఈయన వచ్చే వరకూ నియోజకవర్గంలో పార్టీ పిల్లి మొగ్గలు వేసింది.. ఎన్నికలకు తిప్పికొడితే ఏడాది కూడా లేదు.. పార్టీలో మాత్రం ఇంకా స్థిరత్వం రాలేదు. ఎవరు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారో ఎవరికి టికెట్ వస్తుందో తెలియదు.. క్యాడర్ లో నిరుత్సాహం.. చాలా సందిగ్ధత పార్టీని వెన్నాడుతూనే ఉంది. కానీ పీవీఎల్ నరసింహరాజు ముందుకొచ్చారు. ఎవరూ నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదంటూ దూసుకెళ్తున్నారు. పార్టీ సేవలో మునిగి తేలుతున్న పీవీఎల్‌కు స్రజలు కూడా బ్రహ్మరధం పడుతున్నారు. ప్రస్తుతం పార్టీ అధిష్టానం కూడా మంచి సహకారం అందిస్తోంది. ప్రస్తుతం పీవీఎల్ ఎంట్రీ చూస్తున్న కార్యకర్తలు మా రాజుగారి ర్యాలీ ట్రీజర్ చూస్తేనే ఇలా బయపడుతున్నారు అంటే. సినిమా చూసే సత్త టీడీపీకి లేదని, నియోజకవర్గం రాజకీయ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున జన సందోహంతో సుమారు 40 కి.మీ పొడవునా, ఐదువేల పైచిలుక ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ జరిగింది. ఉండి నియోజకవర్గ చరిత్రలె ఇదొక ఒక చారిత్రాత్మక ఘట్టంగా చెప్పుకుంటున్నారు.
ఉండి అసెంబ్లికి కాబోయే ఎమ్మెల్యే పీవీఎల్ నరశింహరాజుకు నియోజకవర్గ ప్రజలు పలికింది స్వాగతయాత్ర కాదు, విజయయాత్రగా ప్రజలు చెప్పుకుంటున్నారు. ర్యాలీలో పాల్గొన్న అభిమానులు, కార్యకర్తలకు పీవీఎల్ కూడా పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మీతోనే నా జీవిత కాల ప్రయాణం అంటూ భావోద్వేగానికి గురయ్యారు. మొత్తమ్మీద ఉండి గడ్డపై 2019లో పీవీఎల్ భారీ మెజారిటీతో గెలుపొంది వైసీపీ జెండా ఎగురవేస్తున్నారనే అంచనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.