తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా అయన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ కు మద్దతివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను వ్యక్తిగతంగా అభ్యర్థించారు.
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా తమ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్న విషయం వివరించి, మద్దతు కోరారు. పార్టీ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బదులిచ్చారు.