తాట తీసేస్తా.. తోలు తీసేస్తా.. విప్లవం రావాలి.. కత్తులు పట్టుకోవాలనిపించింది.. తుపాకులకు ఎదురెళ్తా.. ప్రత్యేక దేశాలు కావాలి.. రాష్ట్రం విభజన మళ్లీ కోరుకుంటున్నాం.. పంచెలూడదీసి కొడతా.. గుడ్డలూడదీసి తన్నేస్తా.. ఇవన్నీ ఎవరో అనడం లేదు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలు.. అసందర్భంగా ఆయన మాట్లాడే మాటలకు నెటిజన్లు, సామాన్యులు భయబ్రాంతులకు గురవుతున్నారు. గడ్డం ఫుల్లుగా పెంచుకుని, కత్తులు పట్టుకు తిరుగుతూ, అల్ ఖైదా ఉగ్రవాదుల లాగ మీ స్టేట్మెంట్ లు ఏంటి కళ్యాణ్ అని ప్రశ్నిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య భారతదేశం అనుకుంటున్నారా.? పాకిస్తాన్.. సిరియా అనుకుంటున్నారా.? అని ప్రశ్నిస్తున్నారు. జనసేన అనేది పొలిటికల్ పార్టీనా లేక ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చే గ్రూపా. అంటూ విరుచుకుపడుతున్నారు.. చంద్రబాబుకు మద్దతిచ్చినంతకాలం వైఎస్ కుటుంబంపై విషం కక్కిన పవన్ చంద్రబాబును పన్నెత్తి మాట కూడా అనలేదు.
ఇటీవల పర్యటనల్లో పవన్ మాట్లాడిన వివాదాస్పద వ్యాఖ్యలివిగో.. జనసేన పార్టీ పక్షాన ఒక్కరూ పోటీ చేయలేదు. అందుకే ఎమ్మెల్యేల పై తిరగబడాలని ఆదేశిస్తున్నా అంటూ ప్రజలను రెచ్చగొట్టారు. ఇతరులలాగా ఒళ్లు బలిసి మాట్లాడనని ఓ సందర్బంలో చెప్పారు. సహనం, తెగింపు, బలమైన సంకల్పం కావాలన్నారు. సామాజిక, రాజకీయ వ్యవస్థను మార్చకపోతే గూండాలు, ఫ్యాక్షనిస్టులు రాజ్యమేలుతారన్నారు. తుపాకీతో కాల్చేసినోళ్లు, దోపిడీలు చేసి చట్టం నుంచి తప్పించుకున్న వాళ్లు ప్రజల మీద పెత్తనం చేస్తున్నారన్నారు. ఒక్క మాట మాట్లాడితే తెలంగాణ వాళ్లకు కోపం, మాట్లాడకపోతే ఏపీ ప్రజలు తిట్టే పరిస్థితుల్లో తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పానని రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టేలా మాట్లాడారు. రాజధానిలో కాల్పులు జరిగితే తాను తుపాకీ గుళ్లకు ఎదురెళ్తానన్నారు. అంటే కాల్పులు జరగాలని పవన్ కోరుకుంటున్నారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గుండెలనిండా ధైర్యం ఉందంటారు.. తెగింపు ఉందంటారు.. తాను అన్నింటికీ సిద్ధపడే వచ్చానంటారు.
అసలు ఇప్పుడా పరిస్థితి ఎందుకొచ్చింది..? ఏం మాట్లాడుతున్నాడో తెలియక.? ఏ సందర్భంలో ఎవరినుద్దేశించి మాట్లాడుతున్నాడో తెలియక జనం అయోమయానికి గురవుతున్నారు. ఆయన అభిమానులు మాత్రం ఏమీ అర్ధం కాక అరుపులతో కాలక్షేపం చేస్తున్నారు. నెటిజన్లు మాత్రం ఏందిరా నాయనా ఇది.. నోరు తెరిస్తే చద్దామనుకున్నా.. చంపేద్దామనుకున్నా అంటున్నావ్ సినిమాల్లో అవన్నీ ఈజీ నిజ జీవితంలో కాదంటూ పోస్టులు పెడుతున్నారు.