తెలంగాణ చేనేతల ప్రభుత్వమని ..చేనేత కార్మికులకు అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని చేనేత, జౌళి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని శిల్పారామం సాంప్రదాయ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ఫ్యాషన్ షో ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.అనంతరం అయన మాట్లాడుతూ..చేనేత రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ నిధులను కేటాయించిందన్నారు.
Minister @KTRTRS participated in a #NationalHandloomDay event at Shilparamam in Hyderabad. Katherine Hadda, @USCGHyderabad, @jayesh_ranjan, Prl Secy, IT & Industries Dept and Shailaja Ramaiyer, Director, Handlooms & Textiles participated. pic.twitter.com/TN3COJwR7w
— Min IT, Telangana (@MinIT_Telangana) August 7, 2018
చేనేతకు రూ. 400 కోట్లకు పైగా నిధులు కేటాయించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. రాష్ట్రంలో 17,573 మగ్గాలు ఉన్నాయని, 42 వేల మందికి పైగా వీటిపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. చేనేత మిత్ర పథకాన్ని రూపొందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. చేనేత మిత్ర, నేతన్నకు చేయూత పథకాలతో నేతన్నలు ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం నేతన్నకు చేయూత కింద రూ. 60 కోట్లు కేటాయించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రతి నేత కళాకారుడి ఇంట్లో నెలకు రూ. 6 వేల అదనపు ఆదాయం రావాలనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని రూపొందించామన్నారు.