చిత్తూరు జిల్లా పీలేరులోని జాగృతి అపార్టుమెంటులో శిల్ప అనే జూనియర్ డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. శిల్ప, తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలోని పీడీయాట్రిక్ డిపార్టుమెంటులో పీజీ స్టూడెంట్. తనను కొంత మంది ప్రొఫెసర్లు వేధిస్తున్నారంటూ గత ఏప్రిల్ నెలలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులకు, గవర్నర్‌కు శిల్ప ఫిర్యాదు కూడా చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆడపిల్లలు లేరుకాబట్టే ఆయనకు ఆడపిల్లలు పడే బాధలు తెలివని మండిపడ్డారు ఏపీలో ప్రతి పక్ష వైసీపీ పార్టీ చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ..సినీ నటి ఆర్కే రోజా… చిత్తూరు జిల్లా పీలేరులో డాక్టర్ శిల్పా కుటుంబ సభ్యులను పరామర్శించిన రోజా… డాక్టర్ శిల్ప ఆత్మహత్య వ్యవహారంపై అధికారంలో ఉన్న ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది టీడీపీ ప్రభుత్వం చేసిన హత్య అని ఆరోపించిన రోజా… కీచక ప్రొఫెసర్ రవికుమార్, డాక్టర్ కిరీటిలను తక్షణమే సస్పెండ్ చేసి… కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం స్పందించడంలేదని విమర్శించిన రోజా… టీడీపీ ప్రభుత్వంలో ఆడపిల్లలకు రక్షణ లేదన్నారు.
