ఆంధ్రప్రదేశ్ లో ఎంత ప్రయత్నించినా.. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఫోబియాలో నుంచి బయటకు రాలేకపోతున్నారు తెలుగు తమ్ముళ్లు. 230 రోజులుగా వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్ర తెలుగు తమ్ముళ్లకు వణుకు పుట్టిస్తోంది. తమకున్న మీడియా అండతో జగన్ పాదయాత్రను ఎంత తక్కువ చేసి చూపించాలని ప్రయత్నించినా సాధ్యం కావటం లేదని వాపోతున్నారు. జగన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు ఎన్ని కుట్రలు చేసినా.. ఏపీలో ప్రజాభిమానం మాత్రం చెక్కు చెదరకుండా ఉండటం.. అంతకంతకూ పెరిగిపోతున్న వైనం తమ్ముళ్లకు ఇబ్బందిగా మారుతోంది. తమకు అనుకూల మీడియాగా పేరున్న వాటిల్లోనూ జగన్ పాదయాత్ర ఫోటోలు పబ్లిష్ కావటం.. వాటిని ఎంత చిన్నగా ప్రచురించినా.. ఫోటోల్లో పోటెత్తుతున్న జన సందోహాం తమ్ముళ్లకు షాకింగ్ గా మారుతోంది. అంతేకాదు జగన్ ను ఎంత డ్యామేజ్ చేయాలనుకుంటే.. అంతకు 100 రెట్లు రెట్టింపుగా ఆయన ఇమేజ్ మరింత పెరుగుతుంది తప్ప ఎక్కడ తగ్గడం లేదు. ఇది జగమెరగని సత్యం . మరో పక్క కాపుల రిజర్వేషన్ల మీద జగన్ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే టీడీపీ అనుకూల మీడియాలు ప్రచారం చేయకపోయిన…వేరే ఉద్దేశ్యంతో చూపించిన ప్రజలు మాత్రం జగన్ ను భారీగా సన్మానించారు. దీంతో కాపులు ఎక్కువగా ఉండే గోదావరి జిల్లాల్లో జగన్ పాదయాత్రకు పోటెత్తుతున్న జనసందోహాంపై తమ్ముళ్ల నోట మాట రాని పరిస్థితి. గోదావరి జిల్లాల్లో పర్యటిస్తూ.. కాపుల రిజర్వేషన్ల మీద జగన్ చేసిన వ్యాఖ్యలు సాహసోపేతమైనవని.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేలా వ్యవహరించే వైఎస్ జగన్ తీరు గోదావరి ప్రజలు స్వాగతించడంతో టీడీపీ అయోమయంలో పడింది. జిల్లాలో పర్యటిస్తున్న జగన్ పాదయాత్ర ఫోటోలు తమ్ముళ్లను వణికిపోయేలా చేస్తున్నాయి.
