ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని సమస్యలను పక్కదారి పట్టించే విదంగా ఈనాడు,పచ్చ మీడియా కృషి చేస్తోందని ప్రతిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోపించారు. 229వ రోజు పాదయాత్రలో భాగంగా కత్తిపూడిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొన్న వైఎస్ జగన్ ఈనాడు మొదటి పేజీలో సమస్యల గురించి ఎక్కడా రాయకుండా, చంద్రబాబు ప్రకటనలకు ప్రాదాన్యం ఇస్తూ బాకా ఊదుతున్నాయని అన్నారు. చంద్రబాబు అబద్దాలు ఆడినా, మోసం చేసినా, అన్యాయం చేసినా ఈ ఎల్లో మీడియాకు కనిపించదని ఆయన అన్నారు. ఎల్లో మీడియాలో కనిపించేది ఏమిటి చంద్రబాబు ఇంద్రుడు,చంద్రుడు, రైతులు కేరింతలు కొడుతున్నారయ్యా..దేశం అంతా ఇటే చూస్తున్నారన్నంతగా ఎల్లో మీడియా రాస్తోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో కరువు గురించి అల్లాడుతున్నా మంత్రివర్గ సమావేశంలో ఆలోచించడం లేదని జగన్ అన్నారు.రైతులకు గిట్టుబాటు ధరలు లేని పరిస్థితి చూశామని ఆయన అన్నారు.
