ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని ఏపీ ప్రతి పక్ష వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు పరామర్శించనున్నారు. తమ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సీనియర్ నేత బొత్స సత్యనారయణ, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిలు సోమవారం సాయంత్రం కరుణానిధిని ఆసుపత్రిలో కలవనున్నారు. అక్కడి నుంచి ఫోన్‌లో వైఎస్ జగన్‌కు కరుణానిధి ఆరోగ్యంపై సమాచారం ఇవ్వనున్నారు. ఇక వైఎస్ జగన్ సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలతో మమేకం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వయంగా హాజరు కాలేని పరిస్థితి ఉండటంతో పార్టీ సినీయర్ నాయకులతో ఆయన కరుణానిధి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోనున్నారు. వృద్ధాప్య రుగ్మతలతో సతమతం అవుతున్న కరుణానిధి ఆరోగ్యం మరింత క్షీణించడంతో గతనెల 28న కావేరీ ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. గొంతుకు అమర్చిన కృత్రిమశ్వాస గొట్టాన్ని మార్చిన కారణంగా ఆయన ఇన్ఫెక్షన్‌కు గురయ్యారు. ఆనాటి నుంచి స్పృహలేని స్థితిలో ఉండిన కరుణానిధి క్రమేణా కోలుకుంటున్నారు. ఆయన వీల్‌చైర్‌లో కూర్చోని తిరుగుతున్నారని కూడా వైద్యులు ప్రకటించారు.
