ప్రస్తుతం తెలంగాణ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్నది.కికి ఛాలెంజ్ లో భాగంగా తెలంగాణ యువరైతులు చేసిన ఛాలెంజ్ యావత్ ప్రపంచాన్ని ఆకట్టుకుంటుంది. సాధారణంగా గత కొన్ని రోజుల నుండి ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు కికి ఛాలెంజ్.ఈ ఛాలెంజ్ లో భాగంగా యూత్ కదులుతున్న కార్ల నుంచి బయటకొచ్చి డ్యాన్సులు చేస్తున్నారు.
అలా చేసాక తమ ఫ్రెండ్స్‌కు ఈ సవాల్ విసురుతున్నారు.. అయితే ఈ కికి ఛాలెంజ్ ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు దీన్ని సీరియస్ తీసుకున్నారు. కదులుతున్న వాహనం నుంచి కిందకు దిగి డ్యాన్సులు చేస్తే అరెస్ట్ చేస్తామని ఇప్పటికే హెచ్చరించారు.
ఈ క్రమంలోనే రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా లంబాడిపల్లికి చెందిన గీలా అనిల్ కుమార్,పిల్లా తిరుపతి పొలంలో గొర్రు తోలుతూ చేసిన కికి ఛాలెంజ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.నాటు వేసేందుకు సిద్దం చేస్తున్న పొలంలో వీరు చేసిన డ్యాన్స్ కు చాలా మంది ఫిదా అయ్యారు.ఇప్పటికే ఈ వీడియో 16 మిలియన్లకు పైగా వ్యూస్వచ్చాయి .విదేశాలోనూ..వీరి ప్రదర్శనకు ముగ్దులవుతున్నారు.అందరికంటే భినంగా వీరు కికి ఛాలెంజ్ చేసి తమ సత్తా చాటారు.