అన్నా క్యాంటీన్ కోసం ఆక్రమణ యత్నం..సీఎం ఇంటి దగ్గర దారుణం..!
bhaskar
August 6, 2018
18+, ANDHRAPRADESH, POLITICS
1,328 Views
ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి సమీపంలో ఉన్న పంట భూమిలో అధికారులు దౌర్జన్యం ప్రారంభించారు… ఉండవల్లి గ్రామానికి చెందిన గోపాలం శివ శంకర్ అనే రైతుకు చెందిన సాగు భూమిలో ఇది మా భూమి అంటూ అధికారులు జెండాలు ఏర్పాటు చేశారు… అయితే పక్కన ఉన్న భూమి ల్యాండ్ పూలింగ్ ఇవ్వటంతో పలు ప్రభుత్వ కార్యక్రమాలు నిమిత్తం వినియోగిస్తున్నారు.
అయితే తాజాగా సీఎం ఇంటి దగ్గర అన్న క్యాంటీన్ నిర్మించాలని హద్దులు నిర్ణయించే క్రమంలో సదరు రైతు భూమిలో కర్రకు క్లాత్ గట్టి జెండా మాదిరి ఏర్పాటు చేశారు.. అయితే దొండ పందిరి పంట ఉన్న తన భూమిలో జెండా ఏర్పాటు చేయటం పై రైతు మండి పడుతున్నారు…. ల్యాండ్ పూలింగ్ కి ఇవ్వని తన భూమిలో ఎలా జెండాలు పెడతారని,,అడ్డగోలుగా వ్యవహరిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు… పొలం గట్లను కూడా తెంచి వేశారని బాధను వెళ్ళబుచ్చారు.. పంట భూమిలో నిర్మాణం చేసేందుకు బలవంతంగా ప్రయత్నిస్తే ఆత్మహత్య చేసుకునేందుకైనా సిద్ధపడతానని రైతు గోపాలం శివశంకర్ స్పష్టం చేస్తున్నారు..
Post Views: 341