హైదరాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన తన సోదరి లీలమ్మ భౌతిక కాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు . సోదరి మరణవార్త తెలిసి ఢిల్లీ నుండి వెంటనే హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి అల్వాల్ లో సోదరి అంత్య క్రియలకు హాజరయ్యారు . సోదరి పార్ధీవదేహం వద్ద సీఎం కంటతడి పెట్టారు .
